ఆల్టిట్యూడ్ హైస్కూల్‌లో ఘనంగా స్పోర్ట్స్ మీట్ ప్రారంభం
ఎల్కతుర్తి, జనవరి 22: (తెలంగాణ ముచ్చట్లు)
ఎల్కతుర్తి మండల కేంద్రంలోని ఆల్టిట్యూడ్ హైస్కూల్‌లో స్పోర్ట్స్ మీట్‌ను ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో విద్యార్థులు వివిధ రకాల క్రీడా ప్రదర్శనలు, వ్యాయామ విన్యాసాలు, పాటలతో అలరించారు. క్రీడా మైదానంలో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది.
ఈ స్పోర్ట్స్ మీట్ మూడు రోజుల పాటు కొనసాగనుందని, ఈ సందర్భంగా అథ్లెటిక్స్, కబడ్డీ, ఖో-ఖో, వాలీబాల్, లాంగ్ జంప్, షార్ట్ పుట్ తదితర వివిధ క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. విద్యార్థులు క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటుతున్నారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ పుష్కూరి కార్తీక్ రావు మాట్లాడుతూ, చదువుతోపాటు క్రీడలు కూడా ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. క్రీడల వల్ల పిల్లలకు శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతతతో పాటు క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు పెరుగుతాయని తెలిపారు. గెలుపోటములు సహజమేనని, అయితే పోటీతత్వం పెరగడం ద్వారా విద్యార్థులు జీవితంలో ముందుకు సాగేందుకు ఇది దోహదపడుతుందని అన్నారు. ప్రతి పాఠశాలలో క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని, విద్యార్థులను క్రీడల్లో ప్రోత్సహించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ నవీన్, వైస్ ప్రిన్సిపాల్ లింగం మొగిలి, వ్యాయామ ఉపాధ్యాయుడు కర్రెతిరుపతి, ఉపాధ్యాయులు సరిత, లావణ్య, శ్వేత, మమత, సురేష్, ఆశా బేగం, కిషోర్, కృష్ణ, కవిత, గీత, స్వప్న, శ్రావణి, కావ్య, రమ్య తదితరులు పాల్గొన్నారు.
తిరుపతి, ఉపాధ్యాయులు సరిత, లావణ్య, శ్వేత, మమత, సురేష్, ఆశా బేగం, కిషోర్, కృష్ణ, కవిత, గీత, స్వప్న, శ్రావణి, కావ్య, రమ్య తదితరులు పాల్గొన్నారు.


Comments