మల్లాపూర్ ఓల్డ్ విలేజ్‌లో సీసీ రోడ్డు పనుల పరిశీలన

మల్లాపూర్ ఓల్డ్ విలేజ్‌లో సీసీ రోడ్డు పనుల పరిశీలన

_నూతన ఇంజనీర్లకు అభినందనలు తెలిపిన కాంగ్రెస్ నాయకుడు ఎస్‌వి కిట్టు

మల్లాపూర్, జనవరి 21 (తెలంగాణ ముచ్చట్లు)

ఉప్పల్ నియోజకవర్గం నాచారం సర్కిల్ పరిధిలోని మల్లాపూర్ ఓల్డ్ విలేజ్‌లో కొనసాగుతున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎస్‌వి కిట్టు బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల పురోగతి, నిర్మాణ నాణ్యత, ప్రజలకు కలిగే ప్రయోజనాలపై సంబంధిత అధికారులతో సమగ్రంగా చర్చించారు.మల్లాపూర్ ఓల్డ్ విలేజ్‌లో గతంలో రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉండటంతో స్థానికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఎస్‌వి కిట్టు పేర్కొన్నారు. ప్రస్తుతం చేపడుతున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులు పూర్తయితే వాహనదారులు, పాదచారుల సమస్యలు తీరనున్నాయని తెలిపారు. ముఖ్యంగా వర్షాకాలంలో నీరు నిల్వ కాకుండా, దీర్ఘకాలికంగా ఉపయోగపడేలా నాణ్యమైన పనులు చేపట్టాలని అధికారులను సూచించారు.ఈ సందర్భంగా ఇటీవల నూతన బాధ్యతలు స్వీకరించిన నాచారం సర్కిల్ డిప్యూటీ ఇంజనీర్ ఉమా మహేశ్వరి, అసిస్టెంట్ ఇంజనీర్ సూరజ్‌లను ఎస్‌వి కిట్టు ఘనంగా అభినందించారు.ప్రజాప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని, అభివృద్ధి పనుల్లో పారదర్శకతతో పాటు నాణ్యతను తప్పనిసరిగా పాటించాలని కోరారు.ప్రజా సమస్యల పరిష్కారం, మౌలిక సదుపాయాల అభివృద్ధే కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యమని పేర్కొన్న ఎస్‌వి కిట్టు, రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి వంటి అంశాలపై ఎప్పటికప్పుడు అధికారులతో సమన్వయం చేసుకుంటూ అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు మద్ బబ్బాయి, యాది రెడ్డి, రమేశ్ నాయక్, సాయి కుమార్ గౌడ్, వెంకటేష్, రాంప్రసాద్, అన్వర్, బికసపతి, గణేష్ గౌడ్‌లతో పాటు పార్టీ కార్యకర్తలు, మల్లాపూర్ ప్రాంత ప్రజలు పాల్గొని తమ సమస్యలను ఎస్‌వి కిట్టు దృష్టికి తీసుకువచ్చారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .