అరైవ్ అలైవ్ కార్యక్రమంలో ఆటో డ్రైవర్లకు అవగాహన.
- సత్తుపల్లి బస్టాండ్‌లో రవాణా నియమాలపై ప్రత్యేక కార్యక్రమం.
- ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటిస్తామని ఆటో యూనియన్ ప్రతిజ్ఞ.
సత్తుపల్లి, జనవరి 21 (తెలంగాణ ముచ్చట్లు):
సత్తుపల్లి టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా చేపట్టిన అరైవ్ అలైవ్ కార్యక్రమం భాగంగా సత్తుపల్లి టౌన్ సీఐ తుమ్మలపల్లి శ్రీహరి బుధవారం సత్తుపల్లి బస్టాండ్‌లో ఆటో యూనియన్ సభ్యులకు రవాణా నిబంధనలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ, రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, ముఖ్యంగా ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటిస్తే ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని తెలిపారు. అధిక వేగం, తప్పు దారుల్లో వాహనాలు నడపడం వంటి వాటికి దూరంగా ఉండాలని సూచించారు.
అనంతరం ఇకపై అన్ని రవాణా నిబంధనలను తప్పనిసరిగా పాటిస్తామని ఆటో యూనియన్ సభ్యుల చేత ప్రతిజ్ఞ చేయించారు. రోడ్డు భద్రతపై ఇలాంటి కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని పోలీసులు తెలిపారు.


Comments