ఉప్పల్ జోనల్ కార్యాలయంలో కమిషనర్‌గా రాధికా గుప్తా
ఐఏఎస్ బాధ్యతల స్వీకరణ
ఉప్పల్, డిసెంబర్ 26 (తెలంగాణ ముచ్చట్లు):
ఉప్పల్ జోనల్ కార్యాలయంలో నూతన జోనల్ కమిషనర్‌గా రాధికా గుప్తా ఐఏఎస్ గురువారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జోనల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉప్పల్,కాప్రా, బోడుప్పల్, నాచారం, ఘట్కేసర్, నాగారం, సర్కిళ్లకు చెందిన డిప్యూటీ కమిషనర్లు, అధికారులు, సిబ్బంది హాజరై ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.బాధ్యతలు స్వీకరించిన అనంతరం రాధికా గుప్తా మాట్లాడుతూ, ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. అభివృద్ధి పనుల్లో పారదర్శకత, వేగం ఉండేలా చర్యలు తీసుకుంటామని, ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు.ఉప్పల్ జోన్ పరిధిలో మౌలిక వసతుల అభివృద్ధి, పారిశుధ్యం, రోడ్లు, డ్రైనేజీ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని ఆమె తెలిపారు. కార్యక్రమం ప్రశాంత వాతావరణంలో సాగింది.


Comments