కాప్రాలో ఘనంగా అయ్యప్ప స్వామి మహాపడి పూజ
ముఖ్య అతిథులుగా కార్పొరేటర్ స్వర్ణరాజ్ శివమణి, విఠల్ నాయక్
కాప్రా, డిసెంబర్ 26 (తెలంగాణ ముచ్చట్లు):
కాప్రా డివిజన్ పరిధిలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో ధర్మకర్తల మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన అయ్యప్ప స్వామి మహాపడి పూజ కార్యక్రమం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కాప్రా డివిజన్ కార్పొరేటర్ స్వర్ణరాజ్ శివమణి, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ విఠల్ నాయక్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా కార్పొరేటర్ స్వర్ణరాజ్ శివమణి మాట్లాడుతూ అయ్యప్ప స్వామి మహాపడి పూజలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. శ్రీ లక్ష్మీ చెన్నకేశవ ఆలయ ధర్మకర్తల మండలి అత్యంత భక్తిశ్రద్ధలతో గొప్ప ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నిర్వహించిందని ప్రశంసించారు.మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ విఠల్ నాయక్ మాట్లాడుతూ అయ్యప్ప స్వామి దీక్ష ఎంతో పవిత్రమైనదని, భక్తులు అత్యంత నియమ నిష్ఠలతో దీక్ష చేపడుతారని పేర్కొన్నారు. ఆలయ ప్రాంగణంలో తొలిసారిగా మహాపడి పూజను ఘనంగా నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ధర్మకర్తల మండలి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆలయంలో భక్తుల సౌకర్యార్థం నూతన పవర్ బోర్, ఫ్యాబ్రికేటెడ్ షెడ్, విద్యుత్ దీపాల సౌకర్యం, ఆలయ ప్రధాన రహదారి పునఃనిర్మాణం వంటి అభివృద్ధి పనులు చేపట్టడం అభినందనీయమని తెలిపారు.అనంతరం నిర్వహించిన అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో విఠల్ నాయక్‌తో పాటు ఆలయ ఈఓ కృష్ణమాచారి, జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ గౌడ్, ఆలయ చైర్మన్ పుట్టు బాబురావు, దర్శకుడు మల్లా రెడ్డి, నరేందర్ గౌడ్, సత్యనారాయణ, శ్రీధర్ రెడ్డి, వినోద్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప మాలధారులు, భక్తులు, స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో కాప్రా డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు కొబ్బనూరి నాగశేషు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు పవన్ కుమార్, తన్నీరు శ్రీహరి, జి. సత్యనారాయణ, శ్రీకాంత్ గౌడ్, జగదీష్, మురళీ, కె. రాజు, సోమనాథ్, నాగరాజుయాదవ్, మనోజ్ కుమార్, మూర్తుజా, సాయి కుమార్ యాదవ్, గౌతమ్ బన్నీ, శివ చింటూ, రిత్విక్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. 


Comments