కరుణాలయానికి 50 కేజీల బియ్యం విరాళంగా అందజేసిన రిపోర్టర్ అనిల్ రాజ్
Views: 10
On
ధర్మసాగర్,డిసెంబర్24(తెలంగాణ ముచ్చట్లు):
క్రిస్మస్ పండుగ సందర్భంగా ధర్మసాగర్ మండలం కరుణాపురం గ్రామంలోని కరుణాలయంలో అనాధ పిల్లలకు సహాయం అందించారు. రిపోర్టర్ అనిల్ రాజ్ తన తాత గొల్లపల్లి రాజయ్య, నానమ్మ వెంకటమ్మల జ్ఞాపకార్థంగా 50 కేజీల బియ్యాన్ని కరుణాలయానికి విరాళంగా అందజేశారు.
ఈ కార్యక్రమానికి కరుణాపురం గ్రామ సర్పంచ్ గుర్రపు రీనా-ప్రవీణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనాధ పిల్లల సంక్షేమానికి ఇటువంటి సేవలు మరింత విస్తరించాలని ఆమె ఈ సందర్భంగా తెలిపారు.
ఈ కార్యక్రమంలో గొల్లపల్లి నారాయణ, ఎం.డి. శంషుద్దీన్, చిట్యాల రమేష్, కందుకూరి అజయ్ చందర్, కందుకూరి ప్రభాకర్, ఎం.డి. నశిరోద్దీన్, ఫా. సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. సేవాభావంతో ముందుకు వచ్చిన అనిల్ రాజ్‌ను పలువురు అభినందించారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
27 Dec 2025 17:42:39
ఘట్‌కేసర్, డిసెంబర్ 27 (తెలంగాణ ముచ్చట్లు):
మేడ్చల్ నియోజకవర్గం ఘట్‌కేసర్ సర్కిల్‌కు నూతన డిప్యూటీ కమిషనర్‌గా వాణి రెడ్డి శుక్రవారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా...


Comments