ప్రజల వద్దకే పాలన
శాలపల్లి గ్రామంలో ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటున్న సర్పంచ్, ఉపసర్పంచ్
వేలేరు 24 డిసెంబర్ (తెలంగాణ ముచ్చట్లు):
వేలేరు మండలం శాలపల్లి గ్రామంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్, ఉపసర్పంచ్‌లు నాయకులుగా కాకుండా సేవకులుగా ప్రజల వద్దకే వెళ్లి పాలన సాగిస్తున్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం గ్రామ సర్పంచ్ కూరపాటి అశోక్, ఉపసర్పంచ్ ఎర్రగొల్ల రమేష్ ఇంటింటికీ వెళ్లి గ్రామస్తులను కలిసి వారి సమస్యలను ప్రత్యక్షంగా అడిగి తెలుసుకుంటున్నారు.
గ్రామంలో మౌలిక వసతులు, సంక్షేమ పథకాల అమలు, రోజువారీ అవసరాలకు సంబంధించిన సమస్యలపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంటూ, సాధ్యమైన పరిష్కారాల కోసం తక్షణ చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు. గ్రామాభివృద్ధే ప్రధాన లక్ష్యంగా ప్రజల అవసరాలను ముందుగా గుర్తించి పారదర్శకంగా పాలన అందించడమే తమ ఉద్దేశమని స్పష్టం చేశారు.ప్రజల మధ్య తిరుగుతూ సమస్యలను స్వయంగా వింటున్న సర్పంచ్, ఉపసర్పంచ్‌ల విధానంపై గ్రామస్తులు సంతృప్తి వ్యక్తం చేస్తూ, ఇది గ్రామాభివృద్ధికి మంచి ఆరంభమని అభిప్రాయపడుతున్నారు.


Comments