నాచారం రాఘవేంద్ర నగర్‌లో సిమెంట్ రోడ్డు నిర్మాణానికి నిధుల మంజూరు

కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్‌కు కాలనీవాసుల కృతజ్ఞతలు

నాచారం రాఘవేంద్ర నగర్‌లో సిమెంట్ రోడ్డు నిర్మాణానికి నిధుల మంజూరు

నాచారం, డిసెంబర్ 25 (తెలంగాణ ముచ్చట్లు)

ఉప్పల్ నియోజకవర్గం కాప్రా సర్కిల్ నాచారం రాఘవేంద్ర నగర్‌ లోని జాన్సన్ గ్రామర్ స్కూల్ (కాంచన గ్రామర్ స్కూల్) వద్ద రోడ్డు నిర్మించాలని గత కొద్ది రోజులుగా కాలనీవాసులు నాచారం డివిజన్ కార్పొరేటర్‌ను వినతి పత్రాల ద్వారా కోరారు. వారి విజ్ఞప్తులకు స్పందించిన కార్పొరేటర్  శాంతి సాయిజెన్ శేఖర్ రూ.34 లక్షల అంచనా వ్యయంతో సిమెంట్ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయించారు.ఈ సందర్భంగా నిధులు మంజూరు చేయించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ కాలనీవాసులు కార్పొరేటర్‌ను శాలువాతో ఘనంగా సత్కరించారు.కార్పొరేటర్ మాట్లాడుతూ ఇప్పటికే నిధులు మంజూరయ్యాయని, 15 రోజుల్లో టెండర్ ప్రక్రియ పూర్తి చేసి, త్వరలోనే రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. అలాగే వర్షపు నీరు నిలవకుండా సరైన డ్రైనేజీ సౌకర్యాలు కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ముత్యం రెడ్డి, రాంబాబు, నూనె ప్రకాష్, సిహెచ్. రమేష్, ఎండి. హఫీజుద్దీన్, షేక్ మహమూద్, మహమ్మద్ జహంగీర్, రాజేందర్, రామ్ బాబు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .