పీచరలో కూరగాయల మార్కెట్‌కు స్థల పరిశీలన
కబ్జాకు గురైన ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలని ప్రజల విజ్ఞప్తి
వేలేరు,డిసెంబర్18(తెలంగాణ ముచ్చట్లు):
వేలేరు మండలం పీచర గ్రామంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ మరిజె అనిత నర్సింహారావు తన ఎన్నికల వాగ్దానాల్లో భాగంగా కూరగాయల మార్కెట్ ఏర్పాటు కోసం అనువైన స్థలాన్ని పరిశీలించారు. గ్రామంలో ఎక్కడ మార్కెట్ ఏర్పాటు చేస్తే ప్రజలకు సౌకర్యంగా ఉంటుందనే అంశంపై గ్రామస్తులతో చర్చించారు.
ఈ సందర్భంగా ప్రభుత్వానికి చెందిన స్థలంలో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా డబ్బాలు ఏర్పాటు చేసి కబ్జా చేసిన విషయాన్ని గ్రామస్తులు సర్పంచ్ దృష్టికి తీసుకువచ్చారు. ప్రభుత్వ స్థలాన్ని పరిరక్షించాలని, అక్రమ కబ్జాలను తొలగించి ప్రజాప్రయోజనాలకు వినియోగంలోకి తేవాలని వారు కోరారు.
దీనిపై స్పందించిన సర్పంచ్, కబ్జాకు గురైన ప్రభుత్వ స్థలాన్ని కాపాడటానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని, ప్రజలకు ఉపయోగపడే విధంగా వీలైనంత త్వరగా కూరగాయల మార్కెట్ ఏర్పాటు చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మరిజె నర్సింహారావు, మాజీ జడ్పీటీసీ కీర్తి వెంకటేశ్వర్లు, మారబోయిన రాజు, కొయ్యడా మహేందర్, ఎమ్‌డీ హరీఫ్‌తో పాటు పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు.


Comments