కూరగాయల సాగులో మెళకువలపై మూడు రోజుల శిక్షణ కార్యక్రమం

కూరగాయల సాగులో మెళకువలపై మూడు రోజుల శిక్షణ కార్యక్రమం

మేడ్చల్–మల్కాజిగిరి, డిసెంబర్ 15 (తెలంగాణ ముచ్చట్లు):

మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా వాతావరణానికి అనువైన వంగడాల పెంపకం, కూరగాయల నిల్వ కాలాన్ని పెంచే విధానాలు, పంట అనంతరం తీసుకోవాల్సిన యాజమాన్య పద్ధతులపై తెలంగాణ ప్రభుత్వం ఉద్యానశాఖ ఆధ్వర్యంలో “కూరగాయల సాగులో మెళకువలు” అనే మూడు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని సోమవారం నుంచి ఇండో–ఇజ్రాయిల్ అగ్రికల్చర్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు ఉద్యానశాఖ జాయింట్ డైరెక్టర్ రామలక్ష్మి తెలిపారు.జీడిమెట్లలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ వెజిటెబుల్స్ అండ్ ఫ్లవర్స్‌లో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో ఇజ్రాయిల్ ఎంబస్సీ అగ్రికల్చర్ అటాచ్ మాషావ్ ఉరిరాబిన్ స్టీన్, డ్యానిల్ హదాద్ (ఎంబస్సీ ఆఫ్ ఇజ్రాయిల్), జిల్లా ఉద్యానశాఖాధికారి శ్రీధర్‌తో పాటు 12 రాష్ట్రాల నుంచి 40 మంది ఉద్యానశాఖ అధికారులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా జాయింట్ డైరెక్టర్ రామలక్ష్మి మాట్లాడుతూ, కూరగాయలు మరియు పూల సాగులో రైతులకు ఈ శిక్షణ ఎంతో ఉపయోగకరమని అన్నారు. కార్యక్రమంలో మట్టిరహిత కూరగాయల సాగు, బిందుసేద్యం ప్రాముఖ్యత, నీటిలో కరిగే ఎరువుల యాజమాన్య పద్ధతులపై శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. వాతావరణానికి అనుగుణమైన వంగడాల ఎంపిక, కూరగాయల నిల్వ కాలం పెంచేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పంట కోత అనంతరం పాటించాల్సిన పద్ధతులపై ప్రతినిధులు సుబ్బారావు, శేశ్‌నాథ్ వివరించారు. కూరగాయల్లో నులిపురుగుల నివారణపై పీడీ మాణిక్యరావు సూచనలు అందించారు.భారత ప్రభుత్వ అగ్రికల్చర్ పీడీ బ్రహ్మాదేవ్ కూరగాయల అంటుకట్టుట సూత్రాలు,అభ్యాసం,కూరగాయలు–పూల సాగులో వివిధ రకాల ఉపయోగాలపై వివరించారు. డైరెక్టర్ఆఫ్ హార్టికల్చర్  యాస్మిన్ బాషా, ఐఏఎస్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వర్చువల్‌గా పాల్గొని, అధికారులు ఈ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. IMG-20251215-WA0097

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .