నాలాపై కల్వర్టు పనులను పరిశీలించిన కార్పొరేటర్ బన్నాల
చిల్కానగర్, డిసెంబర్ 04 (తెలంగాణ ముచ్చట్లు)
ఉప్పల్ నియోజకవర్గం చిల్కానగర్ డివిజన్ అజ్మత్ నగర్ కాలనీలో సుమారు ఒక కోటి రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న ఇరిగేషన్ నాళాపై కల్వర్టు పనులను కార్పొరేటర్, జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ మాజీ సభ్యురాలు బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్ పర్యవేక్షించారు.అజ్మత్ నగర్ నుండి నార్త్ కల్యాణపురి, మల్లికార్జున్ నగర్ మీదుగా చిల్కానగర్‌కు వెళ్లే ఇది ప్రధాన రహదారి కావడంతో ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె సూచించారు.పనుల సమయంలో సూచిక బోర్డులు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని, ప్రజలకు ప్రత్యామ్నాయ మార్గాలు చూపించే బాధ్యత అధికారులపై ఉందని ఆదేశించారు.కల్వర్టు పనులు మూడు నెలల్లో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు కార్పొరేటర్ గీతా ప్రవీణ్ తెలిపారు.పనులు వేగవంతం కావాలంటే ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలు ఉపయోగించి సహకరించాలని కూడా విజ్ఞప్తి చేశారు.ఈ
కార్యక్రమంలో ఏఈ రాధిక, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్, సీనియర్ నాయకులు ఎద్దుల కొండల్రెడ్డి, కోకొండ జగన్ శ్యామ్, కాలనీ అసోసియేషన్ అధ్యక్షులు అతిశేష రాథోడ్, ప్రొఫెసర్ లాలయ్య, సునీల్, గోపాల్ రావు తదితరులు పాల్గొన్నారు.


Comments