కన్మనూరు కాంగ్రెస్ నేతలు బిఆర్ఎస్ పార్టీలో చేరిక
అడ్డాకల్,డిసెంబర్15(తెలంగాణ ముచ్చట్లు):
అడ్డాకల్ మండలం కన్మనూరు గ్రామంలో సర్పంచ్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నేతలు బిఆర్ఎస్ పార్టీలో చేరారు.మాజీ వార్డ్ మెంబర్స్ రామ్ చరణ్ యాదవ్, మన్నెకొండ యాదవ్, ఆంజనేయులు, జానకి రాంరెడ్డి, ఎం.డి. ఖాదర్ లు ఈరోజు అధికార పార్టీకి చేరినట్లు తెలిపారు.ఈ సందర్భంగా మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ..సర్పంచ్ ఎన్నికల్లో గ్రామ అభివృద్ధికి కృషి చేయడం అత్యంత ముఖ్యమైన పని. పార్టీ కార్యకర్తలు చురుకుగా పాల్గొని అభ్యర్థి లక్ష్మి వెంకటస్వామిని గెలిపించడానికి సహకరించాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సుమతమ్మ భీమ్ రెడ్డి, మాజీ ఉపసర్పంచ్ రాజ వర్ధన్ రెడ్డి, రాజారెడ్డి, బాలస్వామియాదవ్, సత్యనారాయణ రెడ్డి తదితర పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.


Comments