చిల్కానగర్ డివిజన్‌లో విస్తృతంగా పర్యటించిన కార్పొరేటర్ బన్నాల
చిల్కానగర్, డిసెంబర్ 14 (తెలంగాణ ముచ్చట్లు)
చిల్కానగర్ డివిజన్‌లో 100 శాతం అభివృద్ధి పనులు పూర్తి చేస్తా: కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ చిల్కానగర్ డివిజన్ కార్పొరేటర్, జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కమిటీ మాజీ సభ్యురాలు బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్ డివిజన్‌లో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా శివాలయం ప్రాంతంలో కొనసాగుతున్న డ్రైనేజ్ పైప్‌లైన్ పనులను ఆమె పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.అనంతరం డివిజన్ మాజీ అధ్యక్షులు చేర్యాల శ్రీనివాస్ శివాలయం వెనుక వీధుల్లో నూతన స్టార్మ్ వాటర్ డ్రైన్ పైప్‌లైన్లు, సీసీ రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయని బస్తీవాసులతో కలిసి కార్పొరేటర్ దృష్టికి తీసుకువచ్చారు. అలాగే బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు మహమూద్, సైనాజ్ చిల్కానగర్ మర్రిచెట్టు ప్రాంతంలో, ప్రభుత్వ పాఠశాల సమీపంలో ఉన్న స్టార్మ్ వాటర్ డ్రైన్ పైప్‌లైన్లు మరియు సీసీ రోడ్ల దుస్థితిని బస్తీవాసులతో కలిసి చూపించారు.ఈ అంశాలపై స్పందించిన కార్పొరేటర్ గీతా ప్రవీణ్ జీహెచ్


Comments