పిసిపిఎన్‌డిటి నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలి

జిల్లా స్థాయి అడ్వైజరీ కమిటీ సమావేశంలో అధికారుల ఆదేశం

పిసిపిఎన్‌డిటి నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలి

మేడ్చల్ మల్కాజ్గిరి, డిసెంబర్ 15 (తెలంగాణ ముచ్చట్లు)

జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి అడ్వైజరీ కమిటీ (పిసిపిఎన్‌డిటి) సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాలోని ప్రైవేట్ వైద్యసంస్థల్లో పిసిపిఎన్‌డిటి (గర్భధారణ పూర్వ మరియు గర్భస్థ పిండ నిర్ధారణ నిషేధ చట్టం) నిబంధనల అమలు, రిజిస్ట్రేషన్, రీన్యువల్ ప్రక్రియలపై సమగ్రంగా చర్చించారు.ఇటీవల నిర్వహించిన తనిఖీల నివేదికలు, తీసుకున్న చర్యలపై అధికారులు వివరించారు. స్కాన్‌లు నిర్వహిస్తున్న ప్రతి ప్రైవేట్ వైద్యసంస్థ తప్పనిసరిగా పిసిపిఎన్‌డిటి రిజిస్ట్రేషన్ / రీన్యువల్ పూర్తి చేసుకోవాలని స్పష్టం చేశారు.లింగ నిర్ధారణ లేదా పిసిపిఎన్‌డిటి చట్టాన్ని ఉల్లంఘించిన వ్యక్తులు, సంస్థలపై చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని సమావేశంలో హెచ్చరించారు.నిబంధనల అమలు, రికార్డుల నిర్వహణ, ప్రమాణాలు, పరికరాలు, మానవ వనరులు, రిజిస్ట్రేషన్‌కు అవసరమైన పత్రాలపై వైద్యసంస్థలకు ఇవ్వాల్సిన సూచనలను కమిటీ నిర్ణయించింది.ఈ సందర్భంగా కొత్తగా దాఖలైన మరియు రీన్యువల్ అప్లికేషన్లను కమిటీ పరిశీలించి ఆమోదించి, తదుపరి ఉత్తర్వుల కోసం జిల్లా కలెక్టర్‌కు పంపింది. అలాగే పిసిపిఎన్‌డిటి, సరోగసి, ఎంటిపి (మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ) అంశాలపై కూడా చర్చించి, తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేసింది.సమావేశానికి జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి & కమిటీ కన్వీనర్ డా. ఉమా గౌరి, గైనకాలజిస్ట్ డా. స్వర్ణలత, జనిటిసిస్ట్ డా. స్వర్ణలత, ప్రోగ్రాం అధికారులు డా. గీత, డా. పవన్, డిప్యూటీ డెమో వసంత రెడ్డి, సెక్షన్ సిబ్బంది హాజరయ్యారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .