విశ్వశాంతి విద్యాలయానికి ఎక్సలెన్సీ పురస్కారం.

విశ్వశాంతి విద్యాలయానికి ఎక్సలెన్సీ పురస్కారం.

సత్తుపల్లి, డిసెంబర్ 14 (తెలంగాణ ముచ్చట్లు):

జాతీయ స్థాయిలో ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ రిసోర్సెస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బ్రెయిన్ ఫీల్డ్ సంస్థ 2025–26 విద్యా సంవత్సరానికి గాను స్థానిక విశ్వశాంతి విద్యాలయాన్ని ఎక్సలెన్సీ అవార్డుకు ఎంపిక చేసింది. హైదరాబాదు హైటెక్స్‌లో శనివారం ఘనంగా నిర్వహించిన కార్యక్రమంలో విశ్వశాంతి విద్యాలయం యాజమాన్యం పసుపులేటి నాగేశ్వరరావు ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని స్వీకరించారు. విద్యార్థులకు ఉన్నత విలువలతో కూడిన నాణ్యమైన విద్యను అందించడం, అంకితభావంతో పనిచేయడం, విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి నిరంతరం పాటుపడడం, వారిలో స్ఫూర్తిని నింపే విధంగా విద్యాబోధన చేయడం వంటి అంశాలలో విశేష ప్రతిభ కనబరుస్తున్న విద్యాసంస్థలను గుర్తించి ఈ అవార్డులు అందజేస్తున్నట్లు బ్రెయిన్ ఫీల్డ్ సంస్థ నిర్వాహకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని ప్రముఖ విద్యాసంస్థల నిర్వాహకులు, ప్రైవేట్ విద్యాసంస్థల సంఘ రాష్ట్ర నాయకులు పాల్గొని వేడుకకు ప్రత్యేక శోభను చేకూర్చారు. ఆధునిక విద్యా రంగ అభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని ఏర్పాటు చేసిన ఎడ్యుకేషన్ స్టాల్స్ ప్రదర్శన సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంది.

Tags:

Post Your Comments

Comments

Latest News

కూరగాయల సాగులో మెళకువలపై మూడు రోజుల శిక్షణ కార్యక్రమం కూరగాయల సాగులో మెళకువలపై మూడు రోజుల శిక్షణ కార్యక్రమం
మేడ్చల్–మల్కాజిగిరి, డిసెంబర్ 15 (తెలంగాణ ముచ్చట్లు): మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా వాతావరణానికి అనువైన వంగడాల పెంపకం, కూరగాయల నిల్వ కాలాన్ని పెంచే విధానాలు, పంట అనంతరం తీసుకోవాల్సిన యాజమాన్య...
పిసిపిఎన్‌డిటి నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలి
కలెక్టర్ కార్యాలయంలో  ప్రజావాణికి 107 ఫిర్యాదులు
సర్పంచ్‌గా మమతకు మద్దతుగా ఇంటింటా ప్రచారం చేసిన ఎర్రబెల్లి బండారి లక్ష్మారెడ్డి
కాప్రా మున్సిపల్ డీసీ జగన్‌పై సర్వత్రా నిరసనలు
సైబర్ మోసాల పట్ల అప్రమత్తం
క్రిటికల్ పోలింగ్ స్టేషన్ సందర్శించిన కల్లూరు ఏసిపి