సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులకు ఘన సన్మానం
శుభాకాంక్షలు తెలిపిన డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి
పెద్దమందడి,డిసెంబర్14(తెలంగాణ ముచ్చట్లు):
రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి నూతనంగా ఎన్నికైన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులను శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.పెద్దమందడి మండలం జగత్‌పల్లి గ్రామంలో జరిగిన మొదటి విడత సర్పంచ్ ఎన్నికల్లో, పెద్దమందడి మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెంటన్న యాదవ్ గారు 185 ఓట్ల మెజార్టీతో సర్పంచ్‌గా ఘన విజయం సాధించారు. అలాగే మోజర్ల గ్రామంలో జరిగిన ఎన్నికల్లో రాయి కంటి రాములు యాదవ్ ఉప సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఐదుగురు వార్డు సభ్యులను కూడా డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి శాలువాలతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ చిన్నారెడ్డి మాట్లాడుతూ.. గ్రామ ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ, వారి నమ్మకాన్ని నిలబెట్టుకునేలా ప్రజాప్రతినిధులు పనిచేయాలని సూచించారు. ప్రజా ప్రభుత్వ పథకాలను సమర్థంగా అమలు చేసి గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని తెలిపారు.


Comments