కాకరవాయి ఉపసర్పంచ్‌గా కొత్తపల్లి వినోద ఏకగ్రీవ ఎన్నిక
గ్రామ అభివృద్ధికి సర్పంచ్‌తో కలిసి పనిచేస్తాం..వినోద
ఖమ్మం బ్యూరో, డిసెంబర్ 15(తెలంగాణ ముచ్చట్లు)
తిరుమలాయపాలెం మండలం కాకరవాయి గ్రామంలో ఇటీవల నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల్లో సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ అభ్యర్థి కొత్తపల్లి వినోద ఉపసర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గ్రామానికి చెందిన మొత్తం 12 మంది వార్డు సభ్యులు సమావేశమై ఏకగ్రీవ తీర్మానం ద్వారా ఆమెను ఉపసర్పంచ్‌గా ఎన్నుకున్నారు.ఉపసర్పంచ్‌గా ఎన్నికైన సందర్భంగా గ్రామ ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కొత్తపల్లి వినోద మాట్లాడుతూ..తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా సర్పంచ్‌తో కలిసి గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. గ్రామంలో నెలకొన్న మౌలిక సదుపాయాల సమస్యలు, తాగునీరు, రహదారులు, పారిశుధ్యం, విద్యుత్, ఉపాధి వంటి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు.
ప్రజా సమస్యలపై రాజీపడకుండా కమ్యూనిస్టు ఉద్యమ స్ఫూర్తితో పోరాటం కొనసాగిస్తామని, గ్రామంలోని పేదలు, కార్మికులు, రైతులు, మహిళల హక్కుల కోసం సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ తరఫున బలమైన గొంతుగా నిలుస్తానని ఆమె స్పష్టం చేశారు. ప్రజాప్రతినిధిగా గ్రామ ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ పారదర్శక పాలన అందించేందుకు కృషి చేస్తానన్నారు.ఈ కార్యక్రమంలో సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ పార్టీకి చెందిన స్థానిక నాయకులు గడ్డం శ్రీనివాస్ రెడ్డి, న్యూ డెమోక్రసీ మండల నాయకులు కొత్తపల్లి వెంకటేశ్వర్లు, వార్డు సభ్యులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు పాల్గొని ఆమెను అభినందించారు. కాకరవాయి గ్రామ అభివృద్ధిలో ఈ ఎన్నిక కొత్త ఉత్సాహాన్ని తీసుకొస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.


Comments