పెద్దమందడి గ్రామ ప్రగతే లక్ష్యంగా ముందడుగు
పెద్దమందడి గ్రామ సర్పంచ్ సూర్య గంగా
పెద్దమందడి,డిసెంబర్15(తెలంగాణ ముచ్చట్లు):
పెద్దమందడి గ్రామాన్ని సమగ్ర అభివృద్ధి దిశగా తీసుకెళ్లడమే తన ముఖ్య లక్ష్యమని పెద్దమందడి గ్రామ సర్పంచ్ సూర్య గంగా తెలిపారు. గ్రామ ప్రజలు తనపై ఉంచిన విశ్వాసాన్ని బాధ్యతగా తీసుకుని, ప్రణాళికాబద్ధమైన పాలనతో గ్రామానికి కొత్త గుర్తింపు తీసుకొస్తానని అన్నారు.గ్రామంలో తాగునీటి సరఫరా మెరుగుదల, పారిశుద్ధ్య నిర్వహణ, అంతర్గత రహదారుల అభివృద్ధి, డ్రైనేజీ సమస్యల పరిష్కారం, వీధిదీపాల విస్తరణతో పాటు విద్యా–వైద్య సౌకర్యాల బలోపేతానికి ప్రాధాన్యత ఇస్తామని ఆమె పేర్కొన్నారు. ప్రతి సమస్యను గ్రామస్థులతో చర్చించి ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తామని తెలిపారు.ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా ప్రత్యేక చర్యలు చేపడతామని, ముఖ్యంగా మహిళలు, రైతులు, యువతకు మేలు చేసే కార్యక్రమాలపై దృష్టి సారిస్తామని సర్పంచ్ సూర్య గంగా చెప్పారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..స్థానిక ఎమ్మెల్యే మేఘా రెడ్డి సహకారంతో గ్రామాభివృద్ధికి అవసరమైన నిధులు, మౌలిక సదుపాయాలను సమకూర్చి పెద్దమందడి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని స్పష్టం చేశారు.ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, పారదర్శకతతో కూడిన పాలన అందించడమే లక్ష్యమని, గ్రామాభివృద్ధిలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యంతో పెద్దమందడిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని ఆమె ధీమా వ్యక్తం చేశారు.


Comments