పెద్దమందడి సర్పంచ్ బరిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సూర్య గంగా రవి

ఎమ్మెల్యే సహకారంతో పెద్దమందడిని అభివృద్ధి పథంలో నడిపిస్తా

పెద్దమందడి సర్పంచ్ బరిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సూర్య గంగా రవి

పెద్దమందడి,డిసెంబర్04(తెలంగాణ ముచ్చట్లు):

పెద్దమందడి సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంగంలోకి దిగిన సూర్య గంగా రవి గ్రామ అభివృద్ధి పట్ల తాను కట్టుబడి ఉన్నానని తెలిపారు. ప్రజల ఆశయాలను నెరవేర్చే దిశగా స్పష్టమైన అజెండాతో ముందుకు వస్తున్నానని చెప్పారు.తాగునీరు, రోడ్లు, లైటింగ్, డ్రైనేజ్ వంటి ప్రాథమిక సదుపాయాల అభివృద్ధి నుండి మహిళలు, యువత, రైతులకు ఉపయోగపడే పథకాల అమలు వరకు ప్రతి విషయంలో సమగ్ర ప్రణాళికతో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని రవి తెలిపారు.కాంగ్రెస్ నాయకత్వం, ముఖ్యంగా మా ఎమ్మెల్యే మేఘా రెడ్డి సంపూర్ణ సహకారం నాకు పెద్ద బలం. వారి మార్గదర్శకత్వంతో పెద్దమందడి అభివృద్ధి దిశను పూర్తిగా మార్చేలా కృషి చేస్తా. గ్రామ ప్రజలు నాపై ఉంచిన నమ్మకానికి తగ్గట్టుగా ప్రతి ఇంటికి అభివృద్ధి చేరేలా పని చేస్తా అని ఆయన పేర్కొన్నారు.కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తనను ఆశీర్వదిస్తే, అభివృద్ధిని వేగవంతం చేసే ప్రజానాయకత్వం అందిస్తానని సూర్య గంగా రవి హామీ ఇచ్చారు. ప్రజలు కోరుకుంటున్న మార్పు, పురోగతి పెద్దమందడిలో నిలబెట్టడానికి కష్టపడతానని తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .