జిహెచ్ఎంసి పునర్విభజనపై అభ్యంతరాలు కాప్రా ప్రజల డిమాండ్
కాప్రా, డిసెంబర్ 12 (తెలంగాణ ముచ్చట్లు) :
నూతనంగా ప్రతిపాదించిన చక్రిపురం–16 డివిజన్ పేరును‘కుషాయిగూడ–16’గా మార్చాలని నాగార్జున నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. చర్లపల్లి–3 డివిజన్‌ను రెండు భాగాలుగా విభజిస్తూ కొత్త డివిజన్‌కు చక్రిపురం–16 అని నిర్ణయించడంపై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. శతాబ్దం చరిత్ర కలిగిన కుషాయిగూడ పేరు ప్రాంతీయ గుర్తింపు, సంప్రదాయాల ప్రతీకగా నిలుస్తుందని అసోసియేషన్ నేతలు పేర్కొన్నారు.కాప్రా సర్కిల్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో అసోసియేషన్ అధ్యక్షుడు యావపురం రవి, ప్రధాన కార్యదర్శి మొగిలి కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో టీపీఓ తుల్జా సింగ్‌కు వినతిపత్రం సమర్పించారు. డివిజన్‌కు కుషాయిగూడ–16 అనే పేరునే నిర్ణయించాలని కోరారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షులు మహేందర్ గౌడ్, సహాయ కోశాధికారి సాయి వివేక్ తదితరులు పాల్గొన్నారు.


Comments