రోశయ్య వర్ధంతి: 15వ బెటాలియన్‌లో ఘన నివాళి.
కమాండెంట్ పెద్దబాబు ఆధ్వర్యంలో అధికారులు, సిబ్బంది పుష్పాంజలి.
Views: 25
On
సత్తుపల్లి, డిసెంబర్ 04 (తెలంగాణ ముచ్చట్లు):
15వ బెటాలియన్ బి. గంగారం గ్రామంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య వర్ధంతి కార్యక్రమాన్ని కమాండెంట్ ఎన్. పెద్దబాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. రోశయ్య చిత్రపటానికి అధికారులు, సిబ్బంది పుష్పాంజలి ఘటించారు. రోశయ్య ప్రజాసేవ, రాజకీయ జీవితం, పరిపాలనలో నిబద్ధతను స్మరిస్తూ హాజరైనవారు రెండు నిమిషాలు మౌనంగా నిలబడి నివాళులు అర్పించారు. ప్రజల కోసం అంకితభావంతో పనిచేయాలన్న సందేశాన్ని రోశయ్య జీవితం అందిస్తుందని, ఆ విలువలను ఆచరణలో పెట్టాలని కమాండెంట్ పెద్దబాబు సిబ్బందిని కోరారు.
కార్యక్రమంలో అదనపు కమాండెంట్ ఎ. అంజయ్య, అసిస్టెంట్ కమాండెంట్లు యస్. శ్రీధర్ రాజా, వేణుగోపాల్ రెడ్డి, ఆర్ఐలు, ఆర్‌ఎస్‌ఐలు, బెటాలియన్ సిబ్బంది పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
13 Dec 2025 21:23:59
పెద్దమందడి,డిసెంబర్13(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం అమ్మపల్లి గ్రామంలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్ గౌని మాధవి వెంకటేశ్వర రెడ్డిని వనపర్తి...


Comments