రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో భూ నిర్వాసితులకు స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలి 

మాజీ ప్రొఫెసర్ కూరపాటి వెంకట్ నారాయణ 

రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో భూ నిర్వాసితులకు స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలి 
సమావేశంలో మాట్లాడుతున్న వెంకట్ నారాయణ

 కాజీపేట్ డిసెంబర్ 11 (తెలంగాణ ముచ్చట్లు)

 కాజిపేట్ జంక్షన్ పరిధిలో నిర్మాణం అవుతున్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో భూ నిర్వాసితులతోపాటు స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే వరకు ఉద్యమం చేపడుతామని కాకతీయ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ వెంకటనారాయణ అన్నారు. తెలంగాణ రైల్వే జేఏసీ ఆధ్వర్యంలో కాజిపేట్ రైల్వే కమ్యూనిటీ హాల్లో గురువారం పత్రిక, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశ సందర్భంగా నిర్విరామంగా కోచ్ ఫ్యాక్టరీ కోసం కృషిచేసిన భగవాన్ దాస్, కాళిదాస్ లను స్మరించుకుంటూ రెండు నిమిషాల పాటు అందరూ మౌనాన్ని పాటించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన వెంకటనారాయణ మాట్లాడుతూ కాజీపేటలోని రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు నినాదం గత 45 ఏళ్లుగా పోరాటం కొనసాగుతుందని తెలిపారు. భగవాన్ దాస్, కాళిదాసు వంటి సిపిఎం, సిపిఐ నాయకులు ఫ్యాక్టరీని సాధించటం కోసం ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు. వారి కృషి ఫలితమే నేడు నిర్మాణం అవుతున్న ఈ కోచ్ ఫ్యాక్టరీ అని తెలిపారు. గతంలో కాజీపేటకు 1985 లో రావలసిన కోచ్ ఫ్యాక్టరీని పంజాబ్లోని కపూర్త లాకు తరలించ తెలిపారు. తెలంగాణ రైల్వే జేఏసీ అనేక నిరసనలు నిరాహార దీక్షలు చేపట్టడం వల్ల మల్లె కాజీపేటలో ఫ్యాక్టరీ నిర్మాణం నానికి అడుగులు పడ్డాయి అని ఆయన తెలిపారు. ఫ్యాక్టరీ నిర్మాణం కోసం భూమి తెచ్చిన నిర్వాసితుల కుటుంబాలకు స్థానిక తెలంగాణ ప్రాంత నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు రాకపోతే మరొక్కసారి ఉద్యమ బాట పడతామని ఈ పోరాటానికి తాము పూర్తిస్థాయిలో కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు. అనంతరం తెలంగాణ రైల్వే జేఏసీ కన్వీనర్ దేవులపల్లి రాఘవేందర్ మాట్లాడుతూ కోచ్ ఫ్యాక్టరీ సాధనకు చేసిన పోరాటాల స్ఫూర్తితోనే ఇప్పుడు ఉద్యోగాల కోసం మరో ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నామన్నారు. నాలుగైదు రోజుల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా తెలంగాణ మేధావులతో మరో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించి పూర్తిస్థాయిలో పోరాట కార్యక్రమాల కాలెండర్ను ఖరారు చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా కాజీపేట్ మీడియా పాయింట్ అధ్యక్షుడు బత్తిని రాజేందర్ గౌడ్ మాట్లాడుతూ సమిస్ట్రీ కృషి వల్ల  నేడు కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణ దశకు చేరుకున్నది అన్నారు. స్థానిక పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, ఇతర సంఘాల నాయకులు కలిసి భూ నిర్వాసితులకు, స్థానిక నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం తోడ్పడాలని  ఆయన కోరారు మీడియా పరంగా తమ వంతు సహాయ సహకారాలు ఎప్పటికీ ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో వేద ప్రకాష్, గుర్రపు సుధాకర్ రావు, బి రవీందర్, సంగమయ్య, జిట్ట రాజలింగం, మహేష్, ఎస్ లక్ష్మీనారాయణ, మూర్తి, నాగరాజు, మాధవరావు, రాజయ్య, సూర్యనారాయణ, ప్రవీణ్ కుమార్ లతోపాటు గ్రామ మాజీ సర్పంచ్ గడ్డం యాదగిరి ఇలా సాగరం వీరన్న, దుప్పల్లి రమేష్, మామిండ్ల మల్లయ్య, సజ్జనపు రవి కిరణ్, మామిడాల బిక్షపతి, గడ్డం విజయకుమార్, ప్రదీప్ కుమార్ లతోపాటుభూనిర్వాసితులు పాల్గొన్నారు.

 

Tags:

Post Your Comments

Comments

Latest News

అమ్మపల్లి సర్పంచ్ గౌని మాధవి వెంకటేశ్వర రెడ్డికి ఎమ్మెల్యే ఘన సన్మానం అమ్మపల్లి సర్పంచ్ గౌని మాధవి వెంకటేశ్వర రెడ్డికి ఎమ్మెల్యే ఘన సన్మానం
పెద్దమందడి,డిసెంబర్‌13(తెలంగాణ ముచ్చట్లు): వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం అమ్మపల్లి గ్రామంలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్ గౌని మాధవి వెంకటేశ్వర రెడ్డిని వనపర్తి...
మణిగిల్ల సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్‌ను సన్మానించిన మాజీ మంత్రి
వీరాయిపల్లి సర్పంచ్ చిట్యాల వెంకటేష్‌కు ఎమ్మెల్యే ఘన సన్మానం
మణిగిల్ల సర్పంచ్ పీఠం బీఆర్ఎస్ కైవసం
నాచారం ఎరుకల బస్తీలో రోడ్డు సమస్యపై  కార్పొరేటర్ కు వినతి పత్రం 
డ్రోన్ ద్వారా బందోబస్త్ పర్యవేక్షణ
ఘనంగా తేజ ఒకేషనల్ & పారామెడికల్ కళాశాల వార్షికోత్సవం!