వీరాయిపల్లి సర్పంచ్ చిట్యాల వెంకటేష్‌కు ఎమ్మెల్యే ఘన సన్మానం
పెద్దమందడి,డిసెంబర్13(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వీరాయిపల్లి గ్రామ సర్పంచ్‌గా ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన చిట్యాల వెంకటేష్‌ను వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి శుక్రవారం తన నివాస కార్యాలయంలో శాలువాలతో సన్మానించి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామస్థాయి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలం మరోసారి నిరూపితమైందన్నారు. ప్రజల నమ్మకాన్ని గెలుచుకుని సర్పంచ్‌గా ఎన్నికైన చిట్యాల వెంకటేష్ గ్రామాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి, మౌలిక వసతుల కల్పనతో పాటు ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించాలని సూచించారు.గ్రామాల్లో పార్టీ పటిష్టతకు కృషి చేసిన కార్యకర్తల పాత్ర అభినందనీయమని పేర్కొన్న ఆయన, సమిష్టి కృషితో వీరాయిపల్లి గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.


Comments