సి సి రోడ్ల పనులకు ప్రారంభోత్సవం ఎమ్మెల్యే బండారి
కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్
ఉప్పల్, డిసెంబర్ 11 (తెలంగాణ ముచ్చట్లు):
నాచారం డివిజన్ పరిధిలో రోడ్ల అభివృద్ధి పనులు వేగవంతం అవుతున్నాయి. మొత్తం 35 లక్షల రూపాయల వ్యయంతో రెండు కొత్త సిమెంట్ రోడ్ల నిర్మాణ పనులను ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, నాచారం కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్ కలిసి భూమి పూజ చేసి ప్రారంభించారు.ఈఎస్ఐ హాస్పిటల్ ఎదురుగా ఉన్న రవీంద్రనగర్ కాలనీలో చిన్న వర్షం వచ్చినా రోడ్డు పూర్తిగా జలమయమవుతుండటంతో, సమస్య పరిష్కారానికి 25 లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్డు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.అలాగే శ్రీ రాఘవేంద్రనగర్ కాలనీ ఎంట్రన్స్ వద్ద 100 మీటర్ల మేర రోడ్డు గుంతలమయం కావడంతో, సుమారు 10 లక్షల రూపాయల వ్యయంతో కొత్త సిమెంట్ రోడ్డు పనులను ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఇంజనీర్ బాలకృష్ణ, వర్క్ ఇన్స్పెక్టర్ విజయ్‌కుమార్, నాచారం డివిజన్ బారాస నాయకులు, కార్యకర్తలు, శ్రీ రాఘవేంద్రనగర్ కాలనీ వాసులు, కాంక్రీట్ పలాజో వాసులు, రవీంద్రనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


Comments