గ్రేటర్ జిహెచ్ఎంసి కీసర 1వ డివిజన్ హద్దులు ఖరారు
కీసర, డిసెంబర్ 10 (తెలంగాణ ముచ్చట్లు)
మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కీసర మండలానికి సంబంధించిన భౌగోళిక పరిమితులను ప్రభుత్వం అధికారికంగా ఖరారుచేసింది. హైదరాబాద్ గ్రేటర్ జిహెచ్ఎంసి కీసరను నెంబర్ వన్ డివిజన్‌గా ప్రకటిస్తూ హద్దుల వివరాలను విడుదల చేసింది.ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం నర్సంపల్లి ఔటర్ రింగ్ రోడ్ నుంచి యడ్గార్పల్లి – అంకిరెడ్డిపల్లి సరిహద్దుల వరకు ఉత్తర దిశగా డివిజన్ పరిధి విస్తరించనుంది. అక్కడి నుంచి కీసర గ్రామ పరిమితులను అనుసరిస్తూ సర్వే నంబర్ 757 వరకూ తూర్పు, దక్షిణ మార్గాల్లో విస్తరించి ఓఆర్ఆర్ ఎగ్జిట్-8కు చేరుతుంది.పశ్చిమ దిశలో చీర్యాల్, తిమ్మాయిపల్లి, ధర్మవరం గ్రామాల సమీపంగా సాగి మళ్లీ నర్సంపల్లి ఓఆర్ఆర్ వద్దకు చేరుకునే విధంగా డివిజన్ పరిమితులను ప్రభుత్వం నిర్ణయించింది.కీసర నెంబర్ వన్ డివిజన్‌గా గుర్తింపు పొందడంపై స్థానిక నేతలు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కీసర కాంగ్రెస్ నాయకులు రామిడి స్వప్న విజయ్ రెడ్డి మాట్లాడుతూ— “కీసర ప్రాంత అభివృద్ధికి ఇది కీలక నిర్ణయం. మన ప్రియతమ ముఖ్యమంత్రి కి, అలాగే మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు తోటకూర వజ్రెష్ యాదవ్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం’’ అని పేర్కొన్నారు.డివిజన్ గుర్తింపుతో అభివృద్ధి పనులు వేగవంతం కానున్నాయని స్థానిక ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


Comments