టిడబ్ల్యూజేఎఫ్ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడిగా జి. వేణు గౌడ్ నియామకం
మేడ్చల్ మల్కాజిగిరి, డిసెంబర్ 09 (తెలంగాణ ముచ్చట్లు)
జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తానని మేడ్చల్ జిల్లా టిడబ్ల్యూజేఎఫ్ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు జి. వేణు గౌడ్ అన్నారు. మంగళవారం కుత్బుల్లాపూర్ అంబేద్కర్ భవనంలో మేడ్చల్ జిల్లా ఈడబ్ల్యూజేఎఫ్ మూడో మహాసభ ఘనంగా జరిగింది.
ఈ సందర్భంగా టిడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు సోమయ్య మేడ్చల్ జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులుగా జి. వేణు గౌడ్‌ను నియమించారు. తరువాత జరిగిన సభలో మాట్లాడుతూ వేణు గౌడ్— “అనుక్షణం ప్రజలకు, జర్నలిస్టులకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాను” అని తెలిపారు.
త్వరలో ఎల్బీనగర్ జోనల్ కమిటీ, ఘట్కేసర్, పోచారం కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కల్పించడంలో, హెల్త్ కార్డులు అందించే విషయంలో కృషి చేస్తానని పేర్కొన్నారు. జర్నలిస్టుల అభివృద్ధికై నిరంతరం పనిచేస్తానని అన్నారు.ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా టిడబ్ల్యూజేఎఫ్ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు జి. వేణు గౌడ్, కార్తీక్, తాల్క రాములు, భాగ్య, స్వప్న, జహీరుద్దీన్, బొడ్డు నర్సింగరావు, లక్ష్మణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


Comments