ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి జన్మదిన వేడుకలు 

ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి జన్మదిన వేడుకలు 

ఉప్పల్, నవంబర్ 27: (తెలంగాణ ముచ్చట్లు)

*మీర్పేట్ హెచ్.బి కాలనీ*
ఉప్పల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి జన్మదిన వేడుకలు మల్లాపూర్‌లోని విఎన్ఆర్ ఫంక్షన్ హాల్ లో అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, పార్టీ నాయకులు, బీఆర్ఎస్ శ్రేణులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు.జన్మదిన శుభాకాంక్షల సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మీర్పేట్ హెచ్‌బీ కాలనీ డివిజన్ కార్పొరేటర్ జేరిపోతుల ప్రభుదాస్, మాజీ కార్పొరేటర్ గుండారపు శ్రీనివాస్ రెడ్డి కేక్ కట్ చేసి ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలియజేశారు.కార్యక్రమంలో నాయకులు లక్ష్మారెడ్డి ప్రజల అభ్యున్నతికి చేస్తున్న సేవలను ప్రత్యేకంగా ప్రస్తావించారు. పెద్ద సంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు పాల్గొని జన్మదిన వేడుకను విజయవంతం చేశారు.

*నాచారం*:
ఉప్పల్ శాసనసభ్యులు బండారి లక్ష్మారెడ్డి పుట్టినరోజు సందర్భంగా, నాచారం డివిజన్ కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్ ఆధ్వర్యంలో ప్రత్యేక సేవా కార్యక్రమం నిర్వహించారు. గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా నాచారం డివిజన్‌కు చెందిన వికలాంగుడు శోభన్ కు ₹1,10,000/- (లక్ష పది వేల రూపాయల) విలువ చేసే మూడు చక్రాల జుపిటర్ స్కూటర్ ను ఎమ్మెల్యే చేతుల మీదుగా ఉచితంగా అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పట్ల తమ అభిమానం వ్యక్తం చేస్తూ, నాచారం డివిజన్ నాయకులు, కార్యకర్తలు, కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో నాయకులు ఎమ్మెల్యే చేసిన సేవా కార్యక్రమాలను ప్రశంసిస్తూ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

*చిలుకానగర్*:
ఉప్పల్ శాసనసభ్యులు బండారి లక్ష్మారెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని చిలుకానగర్ డివిజన్ కార్పొరేటర్, జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ మాజీ సభ్యురాలు బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్ ఆధ్వర్యంలో ఘనమైన వేడుకలు నిర్వహించబడ్డాయి. చిలుకానగర్ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి భారీ కేక్‌తో ర్యాలీగా బయలుదేరి మల్లాపూర్ విఎన్ఆర్ ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన జన్మదిన కార్యక్రమానికి చేరుకున్నారు.కార్యక్రమ స్థలానికి చేరుకున్న తరువాత భారీగా బాణాసంచా కాల్చి, ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డిని చాలువాతో సత్కరించి, వారు కేకును కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా కార్పొరేటర్ గీతా ప్రవీణ్ మాట్లాడుతూ, “పేదలు, బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి అయిన బండారి లక్ష్మారెడ్డి  సేవలు చిరస్మరణీయాలు. ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, భగవంతుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ వారిపై ఉండాలని కోరుకుంటున్నాను” అని అన్నారు.ఈకార్యక్రమం లో టిఆర్ఎస్ పార్టీ చిలుకానగర్ డివిజన్ నాయకులు, మహిళా నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను మరింత వైభవంగా మార్చారు.IMG-20251127-WA0071IMG-20251127-WA0069

Tags:

Post Your Comments

Comments

Latest News

అమ్మపల్లి సర్పంచ్ గౌని మాధవి వెంకటేశ్వర రెడ్డికి ఎమ్మెల్యే ఘన సన్మానం అమ్మపల్లి సర్పంచ్ గౌని మాధవి వెంకటేశ్వర రెడ్డికి ఎమ్మెల్యే ఘన సన్మానం
పెద్దమందడి,డిసెంబర్‌13(తెలంగాణ ముచ్చట్లు): వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం అమ్మపల్లి గ్రామంలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్ గౌని మాధవి వెంకటేశ్వర రెడ్డిని వనపర్తి...
మణిగిల్ల సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్‌ను సన్మానించిన మాజీ మంత్రి
వీరాయిపల్లి సర్పంచ్ చిట్యాల వెంకటేష్‌కు ఎమ్మెల్యే ఘన సన్మానం
మణిగిల్ల సర్పంచ్ పీఠం బీఆర్ఎస్ కైవసం
నాచారం ఎరుకల బస్తీలో రోడ్డు సమస్యపై  కార్పొరేటర్ కు వినతి పత్రం 
డ్రోన్ ద్వారా బందోబస్త్ పర్యవేక్షణ
ఘనంగా తేజ ఒకేషనల్ & పారామెడికల్ కళాశాల వార్షికోత్సవం!