హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ తెలంగాణ వైస్ ప్రెసిడెంట్‌గా చిల్లంచర్ల కృష్ణవేణి
ఉప్పల్, డిసెంబర్ 8 (తెలంగాణ ముచ్చట్లు) :
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కార్యాచరణ కొనసాగిస్తున్న హెడ్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ తెలంగాణ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్‌గా చిల్లంచర్ల కృష్ణవేణి నియమితులయ్యారు. ఈ మేరకు సంస్థ చైర్మన్ మాధవ్ ఉత్తర్వులు జారీ చేస్తూ సోమవారం నియామక పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా చిల్లంచర్ల కృష్ణవేణి మాట్లాడుతూ— రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పగించినందుకు చైర్మన్ మాధవ్‌కి, నా నియామకానికి కృషి చేసిన జాతీయ ప్రధాన కార్యదర్శి సతీష్ దేవరకొండ కి ధన్యవాదాలు తెలిపింది. మానవ హక్కుల పరిరక్షణలో బాధితులకు అండదండగా నిలిచి, న్యాయం కోసం నిరంతర పోరాటం చేస్తానని స్పష్టం చేసింది.తన దృష్టికి వచ్చే సమస్యలను పరిష్కరిస్తూ సంస్థ అభివృద్ధికి కృషి చేస్తానని, అలాగే సంస్థ చేపట్టే కార్యక్రమాల విజయవంతానికి పనిచేస్తానని ఆమె తెలిపింది. మానవ హక్కుల పరిరక్షణకు తన వంతు పాత్రను పోషిస్తానని కృష్ణవేణి పేర్కొన్నారు.పదవి స్వీకరణ సందర్భంలో సంస్థ సభ్యులు మరియు స్థానిక ప్రముఖులు చిల్లంచర్ల కృష్ణవేణిని ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.


Comments