పోస్టల్ బీమా పథకాలను సద్వినియోగం చేసుకోండి

పోస్టల్ బీమా పథకాలను సద్వినియోగం చేసుకోండి

--- తక్కువ డబ్బులతో ఎక్కువ బీమా
--- పోస్టల్ అవగాహన సదస్సులో సూపరింటెండెంట్ వీరభద్రస్వామి

ఖమ్మం బ్యూరో, డిసెంబర్ 9 (తెలంగాణ ముచ్చట్లు)

తక్కువ ప్రీమియంతో ఎక్కువ బీమా పొందే పోస్టల్ ఇన్సూరెన్స్ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఖమ్మం పోస్టల్ డిపార్ట్మెంట్ సూపరింటెండెంట్ వీరభద్రస్వామి పేర్కొన్నారు. ఖమ్మం ప్రెస్ క్లబ్ కార్యాలయంలో టీయూడబ్ల్యూజే (ఐజేయు) ఖమ్మం ప్రెస్ క్లబ్ కమిటీ ఆధ్వర్యంలో నామా పురుషోత్తం అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన పోస్టల్ అవగాహన సదస్సులో వీరభద్రస్వామి మాట్లాడారు. తపాలా శాఖలో అమలవుతున్న సేవింగ్, ఇన్సూరెన్స్ పథకాలను వివరించారు. తక్కువ ప్రీమియంతో ఎక్కువ బీమాను పొందే అవకాశం తపాలా శాఖలో ఉందన్నారు. ఇక్కడ అమలవుతున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పథకాల ద్వారా కుటుంబానికి ఆర్థిక భద్రత ఉంటుందని అన్నారు. తపాలాశాఖ నుండి సేవింగ్స్, బ్యాంక్ అకౌంట్, రికరింగ్ డిపాజిట్ అకౌంట్, సుకన్య సమృద్ధి అకౌంట్ పథకాలు అమలవుతున్నాయన్నారు. సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ లో అకౌంట్ ను కేవలం 500 రూపాయలతో ప్రారంభించవచ్చని దీనివల్ల నాలుగు శాతం వడ్డీ, ఏటీఎం, నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ సౌకర్యం ఉంటుందన్నారు. దేశంలో ఎక్కడి నుండైనా పోస్ట్ ఆఫీస్ ద్వారా జమతో పాటు డ్రా చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. రికరింగ్ డిపాజిట్ ద్వారా వంద రూపాయలు మొదలుకొని ఎంత వరకైనా ఐదేళ్లపాటు జమ చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. సుఖన్య సమృద్ధి పథకం ద్వారా పదేళ్ల లోపు ఇద్దరు ఆడపిల్లలు ఉన్న వారు 250 రూపాయలతో ఖాతాను ప్రారంభించి 250 రూపాయల నుండి లక్షన్నర వరకు జమ చేయవచ్చని తెలిపారు. ఖాతా ప్రారంభించిన తేదీ నుండి 15 ఏళ్ల వరకు డబ్బులు జమ చేయాలన్నారు. ఆడపిల్లల వివాహం నాటికి నగదు డ్రా చేసుకోవచ్చు అని తెలిపారు. జర్నలిస్టులతో పాటు ప్రతి ఒక్కరికి యాక్సిడెంట్ పాలసీ వల్ల ఉపయోగం జరుగుతుందన్నారు. తొలుత 200 రూపాయలతో అకౌంట్ ఓపెన్ చేసి 550 రూపాయలు చెల్లిస్తే సంవత్సరానికి 10 లక్షల బీమా సౌకర్యం ఉంటుందన్నారు. 750 రూపాయలు చెల్లిస్తే 15 లక్షల వరకు ఇన్సూరెన్స్ ఉంటుందన్నారు. తపాలా జీవిత బీమా గ్రామీణ తపాలా జీవిత భీమా ప్రధానమంత్రి సురక్ష బీమా, ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన పథకాల ద్వారా అత్యధిక బీమా ప్రయోజనాలు పొందవచ్చని వారు తెలిపారు. ఈ సమావేశంలో టీయూడబ్ల్యూజే (ఐజేయు)రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోల రాం నారాయణ మాట్లాడుతూ.. జర్నలిస్టులు తపాలా శాఖ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ఇలాంటి అవగాహన సదస్సుల ద్వారా వ్యక్తితో పాటు కుటుంబాలకు కూడా ఎంతో ఉపయోగ ఉంటుందని పేర్కొన్నారు. అనంతరం పది మంది ఇన్సూరెన్స్ పాలసిలను తీసుకున్నారు.  ఈ సదస్సులో పోస్టల్ డిపార్ట్మెంట్ ఖమ్మం మేనేజర్ రాజేష్, టీయూడబ్ల్యూజే (ఐజేయు) యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఏనుగు వెంకటేశ్వరరావు, మైసా పాపారావు,  ప్రెస్ క్లబ్ కోశాధికారి కళ్యాణ్ చక్రవర్తి, పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో భూ నిర్వాసితులకు స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలి  రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో భూ నిర్వాసితులకు స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలి 
  కాజీపేట్ డిసెంబర్ 11 (తెలంగాణ ముచ్చట్లు)  కాజిపేట్ జంక్షన్ పరిధిలో నిర్మాణం అవుతున్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో భూ నిర్వాసితులతోపాటు స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే
ఉప్పల్ స్టేడియంలో మెస్సి మ్యాచ్ ఏర్పాట్లపై  డిజిపి సమీక్ష
కేసీఆర్ పాలనలో అభివృద్ధిని చూసి ఓటు వేయండి.
బలరాంనగర్ వద్దు.. నేరేడ్మెట్ డివిజన్‌ కావాలంటూ కాలనీ వాసుల డిమాండ్
రుద్ర బెల్లం టీ స్టాల్‌ను ప్రారంభించిన కార్పొరేటర్ బన్నాల 
నాచారంలో షాహి కంపెనీలో మహిళ కార్మికుల సమ్మె నాలుగో రోజు
బేతుపల్లిలో అరుదైన ఘనత… అమ్మను గౌరవించిన కూతురు.