ఒక్క ఛాన్స్ ఇస్తే రాజ్యాతండ ను తీర్చిదిద్దుతా
కాంగ్రెస్ అభ్యర్థి మూడ్ వసంత
-గ్రామ మేనిఫెస్టో విడుదల చేసి మరి ప్రచారం
ఖమ్మం బ్యూరో , డిసెంబర్ 9, తెలంగాణ ముచ్చట్లు;
సర్పంచుగా ఒక్క ఛాన్స్ ఇస్తే రాజ్యాతండ ను తీర్చిదిద్దుతానని సర్పంచ్ అభ్యర్థి మూడ్ వసంత తెలిపారు.ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం రాజ్యాతండ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మూడ్ వసంత ఎన్నికల ప్రచారం చివరి రోజున గ్రామంలో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఇంటి ఆడబిడ్డ వివాహానికి తలంబ్రాల పట్టుచీర 5000/- రూపాయలు కానుక ఇస్తామని హామీ ఇచ్చారు. ఆడపిల్ల పుట్టిన ఇంటికి 5000 సహాయం చేస్తామని గ్రామ ప్రజలందరికీ ఉచిత మినరల్ వాటర్ ఇస్తామని హామీ ఇచ్చారు. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వారి కోసం గ్రంథాలయం నిర్మాణం చేస్తామని తెలిపారు.ఇందిరమ్మ ఇల్లు కట్టుకునే ప్రతి కుటుంబానికి 20 సిమెంట్ కట్టలు అందిస్తామని హామీ ఇచ్చారు. గ్రామంలో దేవాలయం నిర్మాణం అన్నదాన సత్రం నిర్మాణం చేస్తామని హామీలుఇచ్చారు.ఈ ప్రచారం కార్యక్రమంలో అభ్యర్థి భర్త మూడ్ సర్దార్ (సిద్దు) మాజీ సర్పంచ్ మూడ్ సురేష్ తదితరులు పాల్గొన్నారు.


Comments