అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే బండారి
కాప్రా, డిసెంబర్ 10 (తెలంగాణ ముచ్చట్లు)
మీర్పేట్ హెచ్‌బీ కాలనీ డివిజన్ పరిధిలోని పలు కాలనీలలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. బుధవారం జరిగిన కార్యక్రమంలో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, స్థానిక కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్, మాజీ కార్పొరేటర్ గుండారపు శ్రీనివాస్ రెడ్డి లు పూజ చేసి పనులను ప్రారంభించారు. మొత్తం రూ.1,38,60,000 అంచనా వ్యయంతో డ్రైనేజీ పనులు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారి మాట్లాడుతూ... అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజలకు అవసరమైన సహకారం అందిస్తూ ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని అన్నారు. ఉప్పల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం మరింత కృషి చేస్తామని పేర్కొన్నారు. అనంతరం స్థానికులతో మాట్లాడి కాలనీలోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్ మాట్లాడుతూ… డివిజన్ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని, అభివృద్ధి పనులకు సహకరిస్తున్న ఎమ్మెల్యేకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
పనుల వివరాలు : లక్ష్మీనగర్ ట్రాన్స్‌ఫార్మర్ వద్ద రూ.6 లక్షలు, ఇంద్రనగర్ ఫేజ్-1 రోడ్ నం.2 వద్ద రూ.6.20 లక్షలు, క్రైస్ట్ గాస్పెల్ చర్చ్ రాజీవ్‌నగర్ రూ.10 లక్షలు, నవోదయ నగర్ మసీదు ఎదురు రూ.6 లక్షలు, మంగాపురం ఎన్సీఎల్ అపార్ట్‌మెంట్ రూ.10 లక్షలు, మంగాపురం జగదీష్ గల్లి రూ.11.50 లక్షలు, అన్నపూర్ణ టిఫిన్స్ ఎదురు రూ.17 లక్షలు, వసంత రెడ్డి స్వీట్ హౌస్ వద్ద రూ.10 లక్షలు, వెంకటేశ్వరనగర్ రేషన్ షాప్ రూ.9 లక్షలు, తిరుమలనగర్ హనుమాన్ దేవాలయం ఎదురు రూ.6.20 లక్షలు, తిరుమలనగర్ రేషన్ షాప్ రూ.16.50 లక్షలు, కృష్ణానగర్ రోడ్-3 వీరబ్రహ్మం ఆలయం రూ.14 లక్షలు, ఎన్‌టీఆర్ నగర్ పెట్రోల్ పంపు రూ.10 లక్షలు, నరసింహనగర్ ఎనుముల మహేష్ గల్లి వద్ద రూ.6.20 లక్షలు మంజూరు అయినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో వాటర్ వర్క్స్ మేనేజర్ వేణు గోపాల్, నాయకులు వంజరి ప్రవీణ్, ఉల్లెం బాలరాజు, గుమ్మడి జంపాలరెడ్డి, శివరాం ప్రసాద్, రామ్మోహన్‌రావు, వసంతరావు, ప్రసాద్, సాయికుమార్, హరినాథ్ రెడ్డి, వీరభద్రరావు, మల్లేష్ గౌడ్, బోదాసు రవి, సుబ్బారెడ్డి, అశోక్ రెడ్డి, కిషోర్, కనకయ్య, లింగం, చంద్రశేఖర్, ఇక్బాల్, బాలరెడ్డి, రామకృష్ణ, చక్రవర్తి, అశోక్, జైపాల్, పర్వీన్, సామ్‌సన్, అజయ్, కిస్టఫర్, దాసు, కిరణ్, గొట్టే పోచయ్య, జ్యోతి, స్వరూప, శేఖర్ గౌడ్, నిసార్ అహ్మద్ గోరి తదితరులు పాల్గొన్నారు.


Comments