మోజర్ల గ్రామాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి చూపిస్తా
మోజర్ల సర్పంచ్ అభ్యర్థి మార్చ నాగరాజ్
పెద్దమందడి,డిసెంబర్09(తెలంగాణ ముచ్చట్లు):
పెద్దమందడి మండలం మోజర్ల గ్రామ అభివృద్ధి మార్గంలో కొత్త అధ్యాయాన్ని రాయాలనే సంకల్పంతో సర్పంచ్ అభ్యర్థిగా మార్చ నాగరాజు పోటీలో ఉన్నారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన మొదటి పంచాయతీ ఎన్నికల్లో
మార్చనాగరాజు 2014 లో మోజర్ల సర్పంచిగా పెద్దమందడి మండల సర్పంచుల సంఘం అధ్యక్షునిగా పని చేశారు. మార్చ నాగరాజు మోజర్ల సర్పంచిగా ఉన్న సమయంలో ఊర్లో పోచమ్మ గుడి, పెద్దమ్మ గుడి, రామలింగేశ్వర ఆలయం నందు ధ్వజస్తంభం, ఆంజనేయ స్వామి ఆలయం నందు ధ్వజస్తంభం ప్రతిష్టాపన చేయడం జరిగింది. ఎన్నో ఏళ్ల నుంచి చేయని గ్రామ పండుగలను ఘనంగా చేయించడం జరిగింది. గ్రామం లో వీధి దీపాలను,సి సి రోడ్లను, డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరచడం జరిగింది. గ్రామంలో చనిపోయిన వ్యక్తి కుటుంబానికి ఆసరాగా 5,000 /- రూపాయలు ఆర్థిక సాయం అందిస్తూ వారి కుటుంబానికి అండగాఉన్నారు.నాగరాజు గ్రామ ప్రజలతో మాట్లాడుతూ..
గ్రామ అభివృద్ధికి అంకిత భావం తో పని చేస్తానని, పారదర్శక పాలనకు కట్టుబడి ఉంటానని ప్రతి ఇంటి సమస్య తన సమస్యగా భావించి పరిష్కార దిశగా కృషి చేస్తానని తెలిపారు. శుద్ధి నీటి సరఫరా విస్తరణ డ్రైనేజ్ వ్యవస్థ పూర్తిగా మెరుగుపరచడం, గ్రామ రోడ్లుసుందరీకరణ, వీధుల అభివృద్ధి వీధి దీపాల ఏర్పాటు గ్రామంలో ప్రజా అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తూ గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని తెలిపారు. గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని నిజం చేసేందుకు ప్రజా ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను బడుగు బలహీన వర్గాల ప్రజలకు చేర్చి గ్రామ అభివృద్ధికి ప్రత్యేకంగా కృషి చేస్తానని తెలిపారు. గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా మార్చ నాగరాజు ఉండడంతో గ్రామ రాజకీయాల్లో కొత్త ఉత్సాహం ,అభివృద్ధి ఆశలు ,ప్రజాసేవ విప్లవం ఆవిర్భవించినట్టుగా కనిపిస్తుంది. గ్రామంలో మార్చనాగరాజు గెలుపు ఖాయమని ఎన్నికలే తరువాయని ప్రజలు ఉత్సాహంతో ఉన్నారు.


Comments