ప్రజల సమస్యలను పరిష్కరించే వారిని గెలిపించండి
వెల్టూర్ 9వ వార్డు స్వతంత్ర అభ్యర్థి కండి అనిత
పెద్దమందడి,డిసెంబర్09(తెలంగాణ ముచ్చట్లు):
పెద్దమందడి మండలం వెల్టూర్ 9వ వార్డులో ఇంటింటి ప్రచారం ముమ్మరం చేసిన స్వతంత్ర అభ్యర్థి బండి అనిత. వెల్టూర్ గ్రామం 9వ వార్డులో సర్పంచ్ వార్డు సభ్యురాలిగా పోటీ చేస్తున్న స్వతంత్ర అభ్యర్థి బండి అనిత ఇంటింటి ప్రచారం నిర్వహించారు. స్థానికుల సమస్యలను తెలుసుకుంటూ, తమ అభ్యర్థిత్వానికి మద్దతు తెలపాలని కోరారు. గ్యాస్ పొయ్యి గుర్తుకు ఓటు నమోదు చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ప్రచార సమయంలో కాలనీలో ఉన్న సమస్యలను నివాసితులు బండి అనిత దృష్టికి తీసుకువచ్చారు. రహదారులు, డ్రైనేజ్ వ్యవస్థ, వీధి దీపాలు, తాగునీటి సరఫరా వంటి అంశాలపై ప్రజలు తమ అభ్యంతరాలను తెలియజేశారు. ఎన్నికల్లో విజయం సాధిస్తే ఈ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తానని ఆమె హామీ ఇచ్చారు.ఇంటింటి ప్రచారంలో స్థానిక మహిళలు, యువత, వృద్ధులు పలువురితో సమూలంగా మాట్లాడిన బండి అనిత, ప్రజల అభిలాషలు, అవసరాలను గుర్తించి పని చేస్తానని తెలిపారు. ప్రజాసేవే తన ధ్యేయమని, కాలనీ అభివృద్ధిని ముఖ్య లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తానని వెల్లడించారు. ప్రజల గొంతు నొక్కే వారిని కాకుండా.. ప్రజల సమస్యలను పరిష్కరించే వారిని గెలిపించండి ఆమె ప్రజలను కోరారు. ప్రచారానికి కాలనీలో ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోందని, ఈ ఆశీర్వాదం తనకు మరింత బలం ఇస్తుందని అభ్యర్థి పేర్కొన్నారు. మంచి పాలన, పారదర్శకత, సమస్యల పరిష్కారమే తన ప్రాధాన్యత అని ఆమె భావించారు.వార్డు అభివృద్ధికి అవసరమైన కార్యక్రమాలు చేపట్టేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, ప్రజలు ఆశించిన విధంగానే సేవలు అందిస్తానని బండి అనిత తెలిపారు.
-


Comments