విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్న డీసీసీ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్
Views: 31
On
కీసర, నవంబర్ 27 (తెలంగాణ ముచ్చట్లు)
మేడ్చల్ నియోజకవర్గం కీసర మండలం దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని చీర్యాల గ్రామంలో పోచమ్మ, రేణుకమ్మ, ఎల్లమ్మ దేవతల విగ్రహ ప్రతిష్ట మహోత్సవం భక్తి శ్రద్ధలతో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా డీసీసీ అధ్యక్షుడు తోటకూరి వజ్రేష్ యాదవ్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.విగ్రహ ప్రతిష్ట అనంతరం వజ్రేష్ యాదవ్ దేవతలకు అభిషేకం, ఆర్చనలు చేసి గ్రామ ప్రజల అభ్యున్నతి, సుఖశాంతి కోసం ప్రార్థించారు. గ్రామాల్లో జరిగే ధార్మిక కార్యక్రమాలు ప్రజల్లో ఐక్యత, శాంతి, సాంప్రదాయ విలువలు పెంపొందించడంలో కీలకమని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.కార్యక్రమంలో స్థానిక నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువకులు, భక్తులు భారీగా పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments