సంప్రీతి తెలుగు కిచెన్ ఫ్యామిలీ రెస్టారెంట్‌ను ప్రారంభోత్సవం చేసిన ఎమ్మెల్యే బండారి
ఏఎస్ రావునగర్, డిసెంబర్ 13 (తెలంగాణ ముచ్చట్లు)
కాప్రా మున్సిపల్ పరిధిలోని డా. ఏఎస్ రావునగర్ రాధిక బస్‌స్టాప్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘సంప్రీతి తెలుగు కిచెన్’ ఫ్యామిలీ రెస్టారెంట్‌ను ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ప్రారంభోత్సవ కార్యక్రమం స్థానిక ప్రజలు, నాయకుల సమక్షంలో ఉత్సాహంగా జరిగింది.ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, తెలుగు సంప్రదాయ భోజన సంస్కృతిని ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ రెస్టారెంట్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. నేటి బిజీ జీవనశైలిలో కుటుంబంతో కలిసి ప్రశాంతంగా భోజనం చేయగలిగే వాతావరణం ఎంతో అవసరమని పేర్కొన్నారు. స్థానిక ప్రజలకు నాణ్యమైన, ఆరోగ్యకరమైన భోజనాన్ని సరసమైన ధరలకు అందిస్తామని యాజమాన్యం తీసుకున్న నిర్ణయం హర్షణీయమన్నారు.ఇలాంటి ఫ్యామిలీ రెస్టారెంట్లు ప్రాంత అభివృద్ధికి తోడ్పడటంతో పాటు, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తాయని ఆయన అన్నారు. స్థానిక వ్యాపారాలను ప్రోత్సహించడం ద్వారా ఆర్థిక చైతన్యం పెరుగుతుందని వివరించారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు బేతి సుభాష్, ఎన్‌వీఎస్ ప్రభాకర్, స్థానిక కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీష సోమశేఖర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు పజ్జూరి పావని మహిపాల్ రెడ్డి, కొత్త రామారావు తదితర ప్రజాప్రతినిధు లు పాల్గొన్నారు. వారు రెస్టారెంట్‌ను పరిశీలించి, యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేశారు.రెస్టారెంట్ యాజమాన్యాన్ని అభినందించిన అతిథులు, సంప్రీతి తెలుగు కిచెన్ ఫ్యామిలీ రెస్టారెంట్‌ను స్థానికులకు ఆదరణ పొందుతూ వ్యాపారపరంగా విజయవంతంగా ఎదగాలని ఆకాంక్షించారు.


Comments