కిలారు మనోహర్ ను అభినందించిన మల్లు నందిని .
మధిర క్యాంపు కార్యాలయంలో కలిసిన నూతన పాలక వర్గం.
.ఖమ్మం బ్యూరో, డిసెంబర్ 13(తెలంగాణ ముచ్చట్లు)
చింతకాని మండల కేంద్రం లోని గ్రామ పంచాయితీ కి నూతనంగా ఎన్ని కైనా పాలక వర్గం శనివారం నాడు మధిర క్యాంపు కార్యాలయంలో తెలంగాణా రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి మల్లు భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని విక్రమార్క ను మర్యాద పూర్వకంగా కలిసిన చింతకాని సర్పంచ్,కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు కిలారు మనోహర్ బాబు మరియు ఉప సర్పంచ్ కోల ఉమ రాణి మరియు వార్డు సభ్యులు.మల్లు నందిని విక్రమార్క నూతనంగా ఎన్నికైన పాలక వర్గం సభ్యులని శాలుతో సన్మానించి అభినందించి మాట్లాడుతూ చింతకాని మండల కేంద్ర గ్రామ పంచాయితీ అభివృద్ధికి అన్ని విధాలుగా సాయ సహకారాలు అందిస్తామని మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ని అత్యధిక మెజారిటీ తో సర్పంచ్ స్థానాన్ని కైవసం చేసుకోవడం వల్ల చింతకాని లో పార్టీ ఎదుగు దాలకు మంచి వాతావరం ఏర్పడింది అని కిలారు మనోహర్ బాబు కి శుభాకాంక్షలు తెలిపి అభినందించారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు కిలారు బాబూరావు,కోల ఉమ రాణి నాగేశ్వరరావు,షేక్ రహ్మతుల్లా,గంధసిరి లలిత,వేముల కొండలరావు,పొనుగోటి బాబు,మాతంగి నాగరాజు పాల్గొన్నారు.


Comments