జమ్మిగడ్డను ప్రత్యేక డివిజన్‌గా ప్రకటించాలి
కాప్రా, డిసెంబర్ 13 (తెలంగాణ ముచ్చట్లు):
కాప్రా సర్కిల్ పరిధిలోని జమ్మిగడ్డను ప్రత్యేక డివిజన్‌గా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ జమ్మిగడ్డ వాసులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. జమ్మిగడ్డలో 20 వేలకుపైగా ఓటర్లు ఉండగా, దాదాపు 40 వేల మంది జనాభా నివసిస్తున్నప్పటికీ మౌలిక వసతులు, పరిపాలనా సేవలు సరైన స్థాయిలో అందడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.జనాభా పెరుగుదలతో పాటు అభివృద్ధి అవసరాలు అధికమయ్యాయని, ప్రత్యేక డివిజన్ హోదా కల్పిస్తే పరిపాలన మరింత సమర్థవంతంగా సాగుతుందని దీక్షకారులు తెలిపారు. రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, పారిశుధ్యం వంటి సమస్యలు పరిష్కారం కావాలంటే ప్రత్యేక డివిజన్ అవసరమని పేర్కొన్నారు.ఈ రిలే నిరాహార దీక్షలో కాలనీ పెద్దలు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వానికి తమ డిమాండ్‌ను వినిపించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి జమ్మిగడ్డను ప్రత్యేక డివిజన్‌గా ప్రకటించాలని వారు కోరారు.


Comments