మణిగిల్ల సర్పంచ్ పీఠం బీఆర్ఎస్ కైవసం
16 ఓట్ల స్వల్ప మెజారిటీతో శ్రీనివాస్ గౌడ్ విజయం
వనపర్తి,డిసెంబర్13(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మణిగిల్ల గ్రామంలో జరిగిన మొదటి విడత సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది. బీఆర్ఎస్ మద్దతుతో పోటీ చేసిన శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శివ యాదవ్‌పై 16 ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలుపొందారు.ఉత్కంఠభరితంగా సాగిన ఈ ఎన్నికల్లో మొదట ఓట్ల లెక్కింపులో స్వల్ప తేడా రావడంతో రీకౌంటింగ్ నిర్వహించగా, మళ్లీ శ్రీనివాస్ గౌడ్‌కే విజయం దక్కింది. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు, నాయకులు ఆనందోత్సాహాలతో గ్రామంలో సంబరాలు జరుపుకున్నారు.పెద్దమందడి మండలంలోని మణిగిల్ల గ్రామంపై జిల్లావ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. బీఆర్ఎస్ అభ్యర్థి శ్రీనివాస్ గౌడ్‌ను ఓడించేందుకు కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, జిల్లా స్థాయి నాయకులు, బీసీ జేఏసీ నేతలు, కొల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జీలు, ఎమ్మెల్యేలు తదితరులు ఏకమై తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ వారి ప్రయత్నాలు ఫలించలేదు.చివరికి 16 ఓట్ల స్వల్ప మెజారిటీతో శ్రీనివాస్ గౌడ్ విజయం సాధించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ విజయం ఆయన కృషికి, పార్టీ శ్రేణుల ఐక్యతకు నిదర్శనమని గ్రామ ప్రజలు, మేధావులు అభిప్రాయపడుతున్నారు.


Comments