పామిరెడ్డిపల్లి సర్పంచ్‌గా కాంగ్రెస్ అభ్యర్థి మధిర మంజుల శ్రీశైలం ఘనవిజయం
పెద్దమందడి,డిసెంబర్12(తెలంగాణ ముచ్చట్లు):
పెద్దమందడి మండలం పామిరెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ పదవిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మధిర మంజుల శ్రీశైలం ఘనంగా కైవసం చేసుకున్నారు. 390 ఓట్ల భారీ మెజారిటీతో వచ్చిన ఈ విజయంతో గ్రామంలో ఆనంద వాతావరణం నెలకొంది. విజయాన్ని పురస్కరించుకుని గ్రామంలో కాంగ్రెస్ శ్రేణులు భారీ ర్యాలీలు నిర్వహించి సంతోషాన్ని వ్యక్తం చేశారు.ఎన్నికైన సర్పంచ్ మధిర మంజుల శ్రీశైలం మాట్లాడుతూ.. గ్రామ ప్రజలు చూపిన నమ్మకాన్ని సద్వినియోగం చేసుకుంటానని, గ్రామ అభివృద్ధి కోసం ప్రతి అడుగూ ముందుకు వేస్తానని తెలిపారు. గ్రామ శుభ్రత, రహదారులు, తాగునీరు, విద్యుత్ తదితర మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు వెల్లడించారు.అదేవిధంగా, ఎమ్మెల్యే మేఘా రెడ్డి సహకారంతో పామిరెడ్డిపల్లిని అభివృద్ధి మార్గంలో ముందుకు తీసుకెళ్తానని మంజుల శ్రీశైలం హామీ ఇచ్చారు. గ్రామ ప్రజలు ఈ విజయాన్ని అభివృద్ధికి నాందిగా అభివర్ణిస్తూ అభినందనలు తెలియజేశారు.


Comments