వెల్టూర్ 9వ వార్డు మెంబర్ బరిలో స్వతంత్ర అభ్యర్థి బండి అనిత
వార్డు ప్రజల ఆశలు–ఆకాంక్షలే నా అజెండా… అభివృద్ధి కోసం మీ ఒక్క అవకాశం కావాలి
పెద్దమందడి,డిసెంబర్04(తెలంగాణ ముచ్చట్లు):
పెద్దమందడి మండలం వెల్టూర్ గ్రామంలో 9 వ వార్డు మెంబర్ పదవికి స్వతంత్ర అభ్యర్థిగా బండి అనిత పోటీ చేస్తున్నారు. వార్డు అభివృద్ధి, ప్రజల సమస్యల పరిష్కారం, పారదర్శక సేవలే తన ప్రధాన లక్ష్యాలు అని ఆమె తెలిపారు.వార్డు ప్రజలకు మాటలతో కాక, పనులతో నిలబడే నాయకత్వం అవసరమని పేర్కొన్నారు. అనిత మాట్లాడుతూ. వెల్టూర్ వార్డులో ఇంకా పరిష్కారంకాని అనేక సమస్యలు ఉన్నాయి. తాగునీరు, రోడ్లు, శుభ్రత, స్ట్రీట్‌లైట్లు, డ్రైనేజ్ వంటి ప్రాథమిక సదుపాయాల మెరుగుదలకు నేను ముందుండి పోరాడతా. ప్రజలు నన్ను ఆశీర్వదిస్తే, మీలో ప్రతి ఒక్కరి ఇంటి సమస్యను నా ఇంటి సమస్యగా భావించి పని చేస్తా అని అన్నారు.పార్టీల వాగ్దానాలు కాక, ప్రజల మధ్యే ఉండి వారి మాట విని పనిచేయడం తన ధ్యేయమని అనిత పేర్కొన్నారు. స్వతంత్ర అభ్యర్థిగా నిలబడ్డా కానీ మీరందరూ నా బలం. మీ నమ్మకం, మీ ఆశీర్వాదమే నా విజయం. అభివృద్ధి కోసం ఒక సారి అవకాశం ఇవ్వండి… సేవలో వెనుకాడను అని వార్డు ప్రజలను ఉద్దేశించి బండి అనిత స్పష్టం చేశారు.


Comments