అంగన్వాడీ ఖాళీ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని డిమాండ్
మేడ్చల్–మల్కాజ్గిరి, డిసెంబర్ 03 (తెలంగాణ ముచ్చట్లు)
మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లాలో అంగన్వాడి టీచర్లు మరియు హెల్పర్లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటియు) కార్యదర్శి బి.శోభారాణి, కోశాధికారిణి పి.శివరాణి ఆధ్వర్యంలో అల్వాల్ ప్రాజెక్ట్ సీడీపీవోకు వినతిపత్రం అందజేశారు.అనంతరం వారు మాట్లాడుతూ—జిల్లాలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్, హెల్పర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఖాళీల కారణంగా ఒకే టీచర్ లేదా ఒక్క ఆయాపై పనిచాపడం అధికంగా పడుతోందని, ఇది పనిచేయడంలో ఇబ్బందులు కలిగిస్తోందని పేర్కొన్నారు.అలాగే అంగన్వాడీ సెంటర్లకు సరుకులు (పప్పు, పాలు, గుడ్లు) రాత్రి 7–8 గంటలకు రావడం వల్ల వర్కర్లు ఇబ్బంది పడుతున్నారని, సరఫరాను తప్పనిసరిగా పాఠశాల టైమింగ్స్‌లో—సాయంత్రం 4 గంటలలోపు—చేయాలని వాహనదారులకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. సరఫరా చేసే కొంతమంది వాహనదారులు అంగన్వాడీ కార్యకర్తలతో దురుసుగా ప్రవర్తిస్తున్నారని, వారి మీద చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కి డిమాండ్ చేశారు.జిల్లాలో అంగన్వాడీ సెంటర్లకు గత ఎనిమిది నెలలుగా గది అద్దె బకాయి ఉన్నందున టీచర్లు యజమానుల ఒత్తిడికి గురవుతున్నారని, సెంటర్లు ఖాళీ చేయమని హెచ్చరికలు వస్తున్నాయని తెలిపారు. వెంటనే పెండింగ్‌లో ఉన్న రెంట్లు విడుదల చేయాలని యూనియన్ కోరింది. సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.


Comments