మద్యం సేవించి వాహనం నడిపిన వ్యక్తికి రెండు రోజుల జైలు శిక్ష

మద్యం సేవించి వాహనం నడిపిన వ్యక్తికి రెండు రోజుల జైలు శిక్ష

వేలేరు,20 నవంబర్(తెలంగాణ ముచ్చట్లు):

వేలేరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్సై అజ్మీరా సురేష్ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రత్యేక తనిఖీల్లో, కారు డ్రైవర్ గుగులోత్ నర్సింహులు మద్యం సేవించి వాహనం నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు.వేలేరు లోక్యా తండాకు చెందిన నర్సింహులను తనిఖీల సమయంలో ఆపి శ్వాస పరీక్ష చేయగా, మోతాదుకు మించగా మద్యం సేవించినట్లు తేలింది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని కోర్టులో హాజరు పరిచారు.కేసును పరిశీలించిన హనుమకొండ రెండవ తరగతి అదనపు న్యాయమూర్తి నర్సింహులకు రెండు రోజుల కారాగార శిక్ష విధిస్తూ తీర్పు తెలిపారు. అనంతరం నిందితుడిని హుజురాబాద్ ఉపజైలుకు తరలించినట్లు ఎస్సై సురేష్ వెల్లడించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .