పెద్దమందడి మండలంలో ఇందిరమ్మ చీరల పంపిణీ విజయవంతం
ఎమ్మెల్యే మేఘా రెడ్డి చేతుల మీదుగా మహిళలకు చీరల పంపిణీ
పెద్దమందడి,నవంబర్22(తెలంగాణ ముచ్చట్లు):
పెద్దమందడి మండల పరిధిలో మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం అద్భుతంగా విజయవంతమైంది. మండలంలోని దాదాపు అన్ని గ్రామాల్లో చీరల పంపిణీ పూర్తవడంతో ఈ కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మండలంలోని వివిధ గ్రామాల్లో నిర్వహించిన పంపిణీ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే మేఘా రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మహిళలకు ఇందిరమ్మ చీరలను స్వయంగా అందజేశారు. శనివారం చీరల పంపిణీ ముగింపు సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి మహిళకు చేరేలా వ్యవస్థను బలోపేతం చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం అని పేర్కొన్నారు.
అలాగే మహిళా సమాఖ్య అధ్యక్షురాలు స్వరూప మాట్లాడుతూ..మా సమాఖ్య సభ్యులు సమన్వయంతో పని చేయడంతో ప్రతి గ్రామంలో చీరల పంపిణీ అంతరాయం లేకుండా విజయవంతంగా పూర్తయింది. మహిళలకోసం ఇలాంటి కార్యక్రమాలను మరింత బలోపేతం చేస్తామని, మహిళల సాధికారితే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం అని అన్నారు.
ఏపీఎం సక్కూర్ నాయక్ మాట్లాడుతూ..మండలంలోని ప్రతి మహిళకు చీరలు సమయానికి చేరేలా ప్రణాళికతో ఏర్పాట్లు చేసాము. గ్రామస్థాయి బృందాలు సమయానికి పనిచేసినందుకు కార్యక్రమం విజయవంతమైంది అని తెలిపారు.పెద్దమందడి మండలంలో భారీగా మహిళలు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఎమ్మెల్యే మేఘా రెడ్డి ఈ కార్యక్రమం విజయంపై సంతోషం వ్యక్తం చేసి, మహిళా సమాఖ్య సభ్యులను, అధికారులను సిబ్బందిని అభినందించడం జరిగిందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం సక్కుర్ నాయక్, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు కొమ్ము స్వరూప, సి సి రాణి తదితరులు పాల్గొన్నారు.


Comments