నూతన 4 లేబర్ కోడ్‌లను వెంటనే రద్దు చేయాలి
నాచారం ఫుడ్ ఫ్యాక్టరీ వద్ద సీఐటీయూ నిరసన
నాచారం, నవంబర్ 22 (తెలంగాణ ముచ్చట్లు)
కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్న నూతన నాలుగు లేబర్ కోడ్‌లను తక్షణమే వెనక్కి తీసుకోవాలని సీఐటీయూ మేడ్చల్ జిల్లా కోశాధికారి పి. గణేష్ డిమాండ్ చేశారు. శనివారం నాచారం పరిశ్రమ ప్రాంతంలోని తెలంగాణ ఫుడ్స్ ముందు కార్మికులతో కలిసి సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భం గా కోడ్ల ప్రతులను దహనం చేసి నినాదాలు చేశారు.సీఐటీయూ నేత పి. గణేష్ మాట్లాడుతూ“మొత్తం 29 కార్మిక చట్టాలను కుదించి నాలుగు కోడ్లుగా మార్చడం ద్వారా యజమా నులకు పూర్తిగా అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది. కార్మిక సంఘాల పోరాటాలతో ఐదేళ్లుగా అమలు నిలిచిపోయిన ఈ కోడ్లను ఇప్పుడు ఒకపక్షంగా అమలు చేస్తే కార్మిక వర్గం తీవ్ర నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది” అని తెలిపారు.కోడ్ల వల్ల ఏర్పడే సమస్యలను వివరించిన ఆయన ఫిక్స్‌డ్ టర్మ్ ఎంప్లాయిమెంట్‌తో స్థిర ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతాయి,8 గంటల పనిని 12 గంటలుగా మార్చడం అమానుషం,మహిళల రాత్రి పూట షిఫ్టులకు భద్రతా హామీలు లేకపోవడం,పరిశ్రమ మూసివేత పరిమితిని 100 నుంచి 300 కార్మికులకు పెంచడం ప్రమాదకరం.కాంట్రాక్ట్ కార్మికుల జీతాలపై యజమానులకు బాధ్యత లేకుండా నిబంధనలు రోజుకు రూ.174 కనీస వేతనం సరిపోతుంద ని చెప్పడం తీవ్ర అన్యాయం, కార్మిక శాఖ అధికారాలను తగ్గించి ఫెసిలిటేటర్లుగా మార్చడం ద్వారా శ్రమ దోపిడీ పెరిగే అవకాశం.“ఈ కోడ్లు అమలులోకి వస్తే కార్మికులు పూర్తిగా యజమానుల ఆధీనంగా మారిపోతారు” అని గణేష్ ఆవేదన వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో కృష్ణ, ఆగమయ్య, రాజేష్, సాయి, ఆంజనేయులు, నరేష్, తిరుపతి రెడ్డి, రమేష్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.


Comments