డిజిటల్‌ అరెస్ట్.. బెదిరింపులకు నమ్మొద్దు

"ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్" అవగాహన కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ

డిజిటల్‌ అరెస్ట్.. బెదిరింపులకు నమ్మొద్దు

ఖమ్మం బ్యూరో, డిసెంబర్ 2, తెలంగాణ ముచ్చట్లు;

డిజిటల్‌గా అరెస్ట్ చేస్తామని బెదిరించి, డబ్బులు డిమాండ్ చేసే సైబర్ నేరగాళ్ళ మాయమాటలు నమ్మి మోసపోవద్దని అడిషనల్ డీసీపీ (అడ్మిన్) రామానుజం అన్నారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో మంగళవారం ప్రారంభమైన "ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్" పేరుతో నిర్వహిస్తున్న సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమంలో భాగంగా పోలీస్ కమిషనర్ సునీల్ దత్ పర్యవేక్షణలో ఖమ్మం పోలీస్ శిక్షణ కేంద్రంలో 150 మందివిద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు.WhatsApp Image 2025-12-02 at 8.00.40 PM ఈ సందర్బంగా అడిషనల్ డీసీపీ మాట్లాడుతూ..మీ వ్యక్తిగత సమాచారాన్ని, ముఖ్యంగా పాస్‌వర్డ్‌లు, బ్యాంక్ వివరాలు, ఓ టీ పీ లను ఎవరితోనూ పంచుకోవద్దని అన్నారు.
అపరిచిత లింక్‌లపై క్లిక్ చేయవద్దని, ఫోన్ ద్వారా వచ్చిన అటాచ్‌మెంట్‌లను తెరవవద్దని సూచించారు. 
డిజిటల్ అరెస్ట్, బెదిరింపుల గురించి భయపడవద్దని అన్నారు. డబ్బును బదిలీ చేయమని లేదా నగదు తీసుకుని ఇవ్వమని కోరే ఇటువంటి అభ్యర్థనలను విశ్వసించవద్దని పేర్కొన్నారు. మీరు ఏదైనా మోసానికి గురైనట్లు భావిస్తే, వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు లేదా సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సైబర్ క్రైమ్ ఏసీపీ ఫణిందర్, సిఐ నరేష్ కుమార్ సైబర్ క్రైమ్ సిబ్బంది పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .