కృష్ణ నగర్ కాలనీలో సిసి రోడ్, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన
నాగారం, నవంబర్ 21 (తెలంగాణ ముచ్చట్లు)
నాగారం మున్సిపల్ పరిధిలోని గోధుమకుంట టీపీఎస్ కృష్ణ నగర్ కాలనీ అభివృద్ధి పనులు వేగంగా ముందుకు సాగుతున్నాయి. కాలనీ వాసుల అభ్యర్థనపై కోటి రూపాయల వ్యయంతో ఏర్పాటు చేస్తున్న సిసి రోడ్ మరియు డ్రైనేజీ పనుల ప్రారంభోత్సవ కార్యక్రమం శుక్రవారం ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథులుగా నాగారం మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముప్పు శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వంగేటి పర్వత రెడ్డి పాల్గొని పూజలు నిర్వహించి పనులకు శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ, కాలనీ ప్రజలు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న సిసి రోడ్డు, డ్రైనేజీ సమస్యలు పరిష్కారమవుతున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. నాణ్యతతో, వేగంగా పనులను పూర్తి చేస్తామని నాయకులు హామీ ఇచ్చారు.ఈకార్యక్రమం లో కీసర మండలం కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడు చీర వినోద్, కాలనీ అధ్యక్షుడు సంతోష్ రెడ్డి, జనరల్ సెక్రటరీ కార్తిక్ సహా కాలనీవాసులు పాల్గొన్నారు.


Comments