ప్రభుత్వ ఆసుపత్రిలో అమృత ధార ట్రస్ట్ ఆధ్వర్యంలో పండ్ల పంపిణీ కార్యక్రమం
మాజీ ఎమ్మెల్యే మైనపల్లి హనుమంతరావు
మల్కాజిగిరి, నవంబర్ 22 (తెలంగాణ ముచ్చట్లు)
వట్టిపల్లి యాదమ్మ అమృత ధార ట్రస్ట్ అందిస్తున్న సేవలు అభినందనీయమని మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు తెలిపారు. యూత్ కాంగ్రెస్ నాయకులు కీర్తిశేషులు నరేష్ 37వ జయంతి సందర్భంగా శనివారం మల్కాజిగిరి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రస్ట్ ఆధ్వర్యంలో రోగులకు పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మైనంపల్లి హనుమంతరావు రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ—ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంస్థ వైస్ చైర్మన్ మనోహర్ మరియు వారి కుటుంబ సభ్యులు అభినందనీయులని పేర్కొన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత విస్తృతంగా కొనసాగించాలని, స్వచ్ఛంద సంస్థలు ప్రజా సేవలో ముందుండాలని సూచించారు. పేదలకు సేవ చేయడంలోనే నిజమైన సంతృప్తి లభిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకులు తిప్పారపు లక్ష్మణ్ మాదిగ, ఎంఎస్‌పి జిల్లా అధ్యక్షులు కేశపాగ రామచందర్ మాదిగ, రామకృష్ణ, జ్యోతి కుమార్, కిరణ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మహిళా నాయకురాళ్లు తదితరులు పాల్గొన్నారు


Comments