మావోయిస్టు నేత హిడ్మా ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన ఇద్దరిపై కేసు నమోదు
Views: 7
On
వేలేరు,22 నవంబర్(తెలంగాణ ముచ్చట్లు):
వేలేరు మండలం సోడాషాపల్లి గ్రామంలో మావోయిస్టు నేత హిడ్మా ఫోటోతో ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన ఘటన పెద్ద వివాదానికి దారితీసింది. ఇటీవల జరిగిన పోలీసుల ఎదురుకాల్పుల్లో హిడ్మా మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన మరణ సమాచారాన్ని తెలియజేస్తూ తుపాకి పట్టుకున్న హిడ్మా చిత్రంతో కూడిన ఫ్లెక్సీని చర్చి గోడపై అతికించినట్లు గ్రామస్థులు గమనించారు.
ప్రభుత్వం నిషేధించిన వ్యక్తి చిత్రాన్ని ప్రదర్శించడం చట్టవ్యతిరేక చర్యగా పరిగణిస్తూ గ్రామానికి చెందిన సురేష్, బుచ్చయ్యలపై కేసు నమోదు చేసినట్లు వేలేరు ఎస్సై సురేష్ తెలిపారు. ఇటువంటి చర్యలు నక్సలిజాన్ని ప్రోత్సహించే ప్రయత్నాలుగా భావించి కఠినంగా వ్యవహరించబడతాయని ఆయన హెచ్చరించారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
03 Dec 2025 21:50:31
ఎల్కతుర్తి, డిసెంబర్ 03(తెలంగాణ ముచ్చట్లు)
ఎల్కతుర్తి మండలంలోని దామెర గ్రామంలో బుధవారం బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో గ్రామ రాజకీయాల్లో విశేష మార్పు చోటుచేసుకుంది. దామెర...


Comments