పసుపులేటి శ్రీలత దంపతులు కాంగ్రెస్ లోకి చేరిక
కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇన్ చార్జి తుంబూరు దయాకర్ రెడ్డి
ఖమ్మం బ్యూరో, నవంబర్ 29, తెలంగాణ ముచ్చట్లు:
నేలకొండపల్లి పట్టణానికి చెందిన సాయిరాం మెడికల్ నిర్వాహకులు పసుపులేటి శ్రీలత - ఉపేందర్ దంపతులు కాంగ్రెస్ పార్టీలో శనివారం చేరారు. తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయం ఇన్ చార్జి తుంబూరు దయాకర్ రెడ్డి వారికి కాంగ్రెస్ కండువా కప్పి ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా దయాకర్ రెడ్డి మాట్లాడుతూ.... “కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం ప్రతి ఒక్కరూ నిబద్ధతతో పని చేయాలన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశాల మేరకు గెలుపు గుర్రాలకే అవకాశం ఉంటుంది” అని స్పష్టంచేశారు. అందరూ ఏకతాటిపై పనిచేసి పార్టీ అభ్యర్థిని ఘనవిజయంతో గెలిపించాలని దయాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బొడ్డు బొందయ్య, వంగవీటి నాగేశ్వరరావు, మామిడి వెంకన్న, మైసా శంకర్, రాంబాబు, దోసపాటి చంద్రశేఖర్, కనమర్లపూడి రమేష్, రాయపూడి నవీన్, ఐతనబోయిన శ్రీను, మన్నే రవి, లక్కమ్ ఏడుకొండలు, కొడాలి గోవిందరావు, వాకా శ్రీనాథ్, రమేష్, గుడిబోయిన వెంకటేశ్వర్లు, సుభాన్, వంగవీటి రవి తదితర నాయకులు పాల్గొన్నారు.


Comments