మోడల్ స్కూల్‌లో గణిత ఒలింపియాడ్ పరీక్ష

మోడల్ స్కూల్‌లో గణిత ఒలింపియాడ్ పరీక్ష

ఎల్కతుర్తి, డిసెంబర్ 2 (తెలంగాణ ముచ్చట్లు):

జాతీయ గణిత దినోత్సవం పురస్కరించుకొని మంగళవారం రోజున హుజురాబాద్‌కు చెందిన గంగిశెట్టి మధురమ్మ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎల్కతుర్తి మండల కేంద్రంలోని మోడల్ స్కూల్‌లో పదవ తరగతి విద్యార్థులకు గణిత ఒలింపియాడ్ పరీక్ష నిర్వహించారు. మొత్తం 70 మంది విద్యార్థులు ఈ పరీక్షలో పాల్గొన్నారు.

గణిత ఒలింపియాడ్‌లో మంచి ప్రతిభ కనబరిచిన మొదటి పది మంది విద్యార్థులకు ప్రతిభ పురస్కారంగా శంకర్ నారాయణ డిక్షనరీలు ట్రస్ట్ నిర్వాహకులు గంగిశెట్టి జగదీశ్వర్ మరియు ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్ వి. లలిత చేతుల మీదుగా అందజేశారు.

ఈ సందర్భంగా ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్ లలిత మాట్లాడుతూ, గణిత ఒలింపియాడ్ పరీక్షలు విద్యార్థుల్లో సమస్య పరిష్కార నైపుణ్యం, తార్కిక ఆలోచన, ఆత్మవిశ్వాసం వృద్ధికి తోడ్పడతాయని తెలిపారు. అధ్యాపక బృందం మాట్లాడుతూ, మధురమ్మ ట్రస్ట్ ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న గణిత టాలెంట్ టెస్టులు విద్యార్థుల దాగి ఉన్న ప్రతిభ వికాసానికి దోహదపడుతున్నాయని, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు విద్యాపరమైన కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని పేర్కొన్నారు.

అనంతరం ప్రతిభ కనబరిచిన విద్యార్థులు అక్షిత, శ్రీ శేష్మ చెర్రీ, అంకిత, విశ్వరాజ్యశ్రీ, నాగేంద్ర, హన్సిక, కీర్తి ప్రియ, మాధురి, కీర్తనలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో అధ్యాపకులు జి. రాజశ్రీ, పి. శ్రీధర్ రెడ్డి మరియు విద్యార్థులు పాల్గొన్నారు.IMG-20251202-WA0013

Tags:

Post Your Comments

Comments

Latest News

దామెర గ్రామ రాజకీయాల్లో కీలక పరిణామం దామెర గ్రామ రాజకీయాల్లో కీలక పరిణామం
ఎల్కతుర్తి, డిసెంబర్ 03(తెలంగాణ ముచ్చట్లు)  ఎల్కతుర్తి మండలంలోని దామెర గ్రామంలో బుధవారం బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో గ్రామ రాజకీయాల్లో విశేష మార్పు చోటుచేసుకుంది. దామెర...
వికలాంగ అనాధ చిన్నారులకు అల్టిట్యూడ్ విద్యార్థుల చేయూత
నేడు విద్యుత్ సరఫరా అంతరాయం
అంగన్వాడీ ఖాళీ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని డిమాండ్
200వ జ్ఞానమాల కార్యక్రమానికి వజ్రష్ యాదవ్‌కు ఆహ్వానం
గ్లోబల్ సమ్మిట్ బందోబస్త్ ఏర్పాట్లను సమీక్షించిన ఏడీజీ మహేష్ భగవత్ ఐపీఎస్
దుర్గామాత దేవాలయం నవమ  బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న నెమలి అనిల్